BigTV English

Bigg Boss 8 Telugu: కంటెస్టెంట్స్‌ను ఏడిపించిన బిగ్ బాస్, పర్సనల్ లైఫ్స్ గురించి ఓపెన్ అయిన నైనికా, సోనియా.. నిజాలు బయటపడ్డాయి

Bigg Boss 8 Telugu: కంటెస్టెంట్స్‌ను ఏడిపించిన బిగ్ బాస్, పర్సనల్ లైఫ్స్ గురించి ఓపెన్ అయిన నైనికా, సోనియా.. నిజాలు బయటపడ్డాయి

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి రెండు వారాలే అయ్యింది. అయినా కూడా వేర్వేరు మనస్థత్వాలు ఉన్న వ్యక్తుల మధ్య కలిసుండడం వల్ల చాలామంది హౌజ్‌మేట్స్ తమ కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నారు. అందుకోసమే బిగ్ బాస్.. వారికోసం ఒక స్పెషల్ సర్‌ప్రైజ్‌ను ఏర్పాటు చేశారు. హౌజ్‌మేట్స్‌కు చాలా దగ్గరయిన వస్తువులను పంపించి వారిని ఎమోషనల్ అయ్యేలా చేశారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సమయానుసారం ఇద్దరు హౌజ్‌మేట్స్‌కు సంబంధించిన వస్తువులు రాగా.. అందులో ఒక హౌజ్‌మేట్ మాత్రమే తనకు ఇష్టమైన వస్తువును దక్కించుకోగలడు. ఈ టాస్క్‌లో హౌజ్‌మేట్స్ పర్సనల్ లైఫ్స్ గురించి పలు నిజాలు బయటికొచ్చాయి.


తండ్రి ప్రేమ

ఎప్పుడూ హౌజ్‌లో సరదాగా ఉంటూ, కుల్లు జోకులు వేస్తూ, నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు శేఖర్ భాషా. అలాంటి శేఖర్ భాషా కూడా ఇంటి నుండి సర్‌ప్రైజ్‌లు వస్తున్నాయి అనగానే తన కుటుంబ సభ్యులను గుర్తుచేసుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి గురించి మాట్లాడుతూ ఏడ్చేశాడు. అభయ్, నిఖిల్, పథ్విరాజ్, నబీల్, ఆదిత్య ఓం కూడా తమ తండ్రుల జ్ఞాపకాల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. కానీ అందులో అభయ్, నబీల్‌, ఆదిత్య ఓంకు మాత్రమే తమ తండ్రులకు సంబంధించిన జ్ఞాపకాలను దక్కించుకునే అవకాశం వచ్చింది. తన తండ్రి గుర్తుగా షర్ట్ రాగా.. అది తాను దక్కించుకోలేక తిరిగి వెళ్లిపోయిందని నిఖిల్ చాలా బాధపడ్డాడు.


Also Read: డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్.. అయ్యాయో, ఆ కుళ్లు జోకులు మిస్ అవుతామా?

బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు

బిగ్ బాస్ హౌజ్‌లో మగవారంతా తమ తండ్రులను గుర్తుచేసుకొని బాధపడగా.. అమ్మాయిలంతా తమ పర్సనల్ లైఫ్, గత రిలేషన్‌షిప్స్‌కు సంబంధించిన సర్‌ప్రైజ్‌లు చూసి ఓపెన్‌గా కొన్ని విషయాలు చెప్పడానికి ముందుకొచ్చారు. హౌజ్‌లో నిఖిల్, పృథ్వితో సోనియా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తుందని ప్రేక్షకులు తనను విమర్శిస్తున్నారు. కానీ మొదటిసారి తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని నిఖిల్ ముందు ఒప్పుకుంది సోనియా. అంతే కాకుండా హౌజ్‌లోకి రావడం వల్ల తన రిలేషన్‌షిప్ ఎఫెక్ట్ అవుతుందేమో అని భయంగా ఉందని తెలిపింది. తన బాయ్‌ఫ్రెండ్‌కు తన గురించి మొత్తం తెలిసినా ఎందుకో భయంగా ఉంది అంటూ నిఖిల్ ఒడిలో పడిపోయి మరీ ఏడ్చేసింది సోనియా.

నైనికా లవ్ స్టోరీ

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న అమ్మాయిల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటూ చాలామందికి గుర్తొచ్చేది నైనికా. అలాంటి తనకు ఇంటి నుండి తనకు ఒక బొమ్మ వచ్చింది. అది చూసి ఎమోషనల్ అవుతూ తన రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టింది. అయిదేళ్లు ఒక మనిషితో రిలేషన్‌లో ఉన్న తర్వాత అది తనకు కరెక్ట్ కాదని అర్థమయ్యి వదిలేసి హైదరాబాద్ వచ్చానని చెప్పుకొచ్చింది. ఇక్కడ తనకు ఒక మనిషితో పరిచయం ఏర్పడిందని, కానీ బిగ్ బాస్‌కు వచ్చే కొన్నిరోజుల ముందుకు ఇద్దరి మధ్య చాలా మనస్పర్థలు వచ్చాయని చెప్తూ ఏడ్చేసింది. దీంతో మిగతా కంటెస్టెంట్స్ అంతా ఆ అబ్బాయి తనకు దక్కాలని కోరుకుంటూ ఆ బొమ్మ తన దగ్గరకు చేరేలా చేశారు.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×