BigTV English

Bank Manager Scam : కి”లేడీ” బ్యాంక్ మేనేజర్.. కస్టమర్ల బంగారంతో ఏం చేసిందో తెలిస్తే..

Bank Manager Scam : కి”లేడీ” బ్యాంక్ మేనేజర్.. కస్టమర్ల బంగారంతో ఏం చేసిందో తెలిస్తే..

Bank Manager Scam : డబ్బైనా.. బంగారమైనా.. ఇంట్లో కంటే బ్యాంక్ లో సేఫ్ గా ఉంటుందని నమ్ముతారు కస్టమర్లు. కానీ.. ఆ బ్యాంకులే పనిచేసేవారే దొంగలుగా మారి.. కస్టమర్ల నమ్మకంపై నీళ్లు చల్లుతున్నారు. బంగారం కుదువపెట్టుకుని లోన్ ఇచ్చి.. ఆ లోన్ తిరిగి చెల్లించినా ఇంతవరకూ కస్టమర్ కు బంగారాన్ని తిరిగి అప్పజెప్పలేదు. పైగా అతని సంతకాన్ని బ్యాంక్ మేనేజర్ ఫోర్జరీ చేసి.. నీ బంగారం ఎప్పుడో తీసేసుకున్నావని డబాయించింది. అతని బంగారాన్ని కాజేసి.. ఎంచక్కా నడుముకు వడ్డాణం చేయించుకుంది. బాధిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది.


కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కి”లేడీ” బ్యాంక్‌ మేనేజర్‌ వ్యవహారం బయటపడింది. గంగూరు యూనియన్ బ్యాంక్ శాఖ మేనేజర్ గా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కస్టమర్‌ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభావతి గతంలో కూడా పలువురిని మోసం చేసి.. గంగూరు యూనియన్ బ్యాంక్ నుంచి డబ్బులు కాజేసినట్లు పేర్కొన్నారు.

గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న ప్రభావతికి భర్తతో విభేదాలు ఉన్నాయి. ఆమె స్వగ్రామం నూజివీడు మండలం మర్రిబంధం. అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్‌లో బ్యాంకు ఖాతా ఉంది. దీనిని ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్‌ఫర్‌ చేయించింది. ఈ సందర్భంగా యోగేశ్వరరావు తన వద్ద ఉన్న 380 గ్రాముల బంగారం కోసం లాకరు అడిగాడు. ప్రభావతి లాకరులో బంగారం దాచేకంటే.. బ్యాంక్ రుణం తీసుకోవాలని ఆయనకు సూచించింది. దీంతో యోగేశ్వరరావు బంగారం తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. గతేడాది నవంబరులోనే తీసుకున్న రుణాన్ని తిరిగి బ్యాంకుకు చెల్లించాడు.


అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభరణాల గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది. ఈ విషయమై గంగూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని కోరింది. యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాల విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోమని కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా యోగేశ్వరరావు షాక్ తిన్నాడు. ఈ ఘటనపై యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండానే తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలను కాజేసిందని యోగేశ్వరరావు పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Big Stories

×