E-Paper
Advertisement

Cricketers In APSRTC : ఆర్టీసీ బస్సుల్లో క్రికెట్ ప్లేయర్లు..

Cricketers In APSRTC : ఆర్టీసీ బస్సుల్లో క్రికెట్ ప్లేయర్లు..
Advertisement

Cricketers In APSRTC : విశాఖలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్.. ఒక సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. అదేమిటంటే రెండు జట్ల ప్లేయర్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం నెట్టింట హల్చల్ చేస్తోంది.

రెండో టెస్ట్ కోసం వచ్చిన క్రికెటర్లు బస చేసిన హోటళ్ల నుంచి గ్రౌండ్ వరకు, మళ్లీ ఆట ముగిసిన తర్వాత గ్రౌండ్ నుంచి హోటల్ కి ఇవే బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ తన అధికారిక వెబ్ సైట్ లో ఫొటోలు పెట్టడంతో నెట్టింట ఇదే చర్చ మొదలైంది.

Advertisement

ఏపీఎస్ ఆర్టీసీకి ఒక ప్రత్యేకతను తీసుకురావడానికి, అంతేకాదు ఆర్టీసీలో కూడా లగ్జరీ బస్సులు ఉన్నాయని ప్రజలకు తెలియజేయడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నామని ఆర్టీసీకి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు.

క్రికెటర్లే ప్రయాణించగా లేనిది, తామెందుకు చేయకూడదని ప్రజలు అనుకుంటారని, అలాగే తమ అభిమాన క్రికెటర్లు ఏం చేస్తే, ప్రజలు అదే ఫాలో అవుతారు కాబట్టి, ఇది తమకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు.

Advertisement

సాధారణంగా అంతర్జాతీయ క్రికెటర్లు హోటల్ నుంచి స్టేడియానికి వెళ్లేందుకు ప్రైవేటు వోల్వో బస్సులను ఉపయోగిస్తారు. కానీ ఏపీఎస్ ఆర్టీసీ విన్నపాన్ని క్రీడాధికారులు మన్నించడంతో ఈ అవకాశం దక్కింది. ఇప్పుడు భారతదేశంలోని రాష్ట్రాల్లో జరిగే ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్ ల్లో కూడా ఆ దేశపు ఆర్టీసీ బస్సులనే ఉపయోగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఈ అవకాశం కల్పించినందుకు బీసీసీఐతో పాటు ఇంగ్లండ్ బోర్డుకి ఏపీఎస్‌ఆర్టీసీ ధన్యవాదాలు తెలిపింది. ఆర్టీసీకి చెందిన డాల్ఫిన్ క్రూజర్ బస్సుల్లో ఇరు దేశాల ఆటగాళ్లు ప్రయాణం చేశారు. ఒకొక్క జట్టుకి రెండేసి బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఏపీఎస్‌ఆర్టీసీని నెటిజన్లు అభినందిస్తున్నారు. సంస్థను మరింత అభివృద్ధి వైపు నడిపించాలని కోరుతున్నారు. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణాన్ని తగ్గించి, సురక్షితంగా తీసుకువెళ్లే ఆర్టీసీకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని అంటున్నారు.

అంతేకాదు తమ వంతుగా కూడా ఆర్టీసీలో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తామని అంటున్నారు. మరికొందరు మాత్రం మన క్రికెటర్లు అందరూ టిక్కెట్లు తీసుకున్నారా? లేదా? అని సరదాగా సెటైర్లు పేల్చుతున్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×