BigTV English

Vijayawada: విజయవాడలో అన్నపూర్ణ, శకుంతల థియేటర్లపై దాడులు, జేసీబీలతో ధ్వంసం

Vijayawada: విజయవాడలో అన్నపూర్ణ, శకుంతల థియేటర్లపై దాడులు, జేసీబీలతో ధ్వంసం

Vijayawada: విజయవాడ సిటీలో ఏం జరుగుతోంది? అన్నపూర్ణ, శకుంతల థియేటర్లపై దాడులు ఎవరి పని? పాతకక్షలు పురి విప్పాయా? రాజకీయ నేతల హస్తం ఏమైనా ఉందా? అర్థరాత్రి వేళ జేసీబీలతో కూల్చడానికి కారణమేంటి? ఇంతకీ కూల్చిన వారెవరు? హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నదెవరు? ఇదే చర్చ ఏపీ అంతటా మొదలైంది.


విజయవాడలోని గవర్నర్ పేటలో అన్నపూర్ణ, శకుంతల థియేటర్లను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. మే 31న అర్థరాత్రి రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ లోపలికి ప్రవేశించారు. అక్కడ నిద్రపోతున్న పనివాళ్లను బెదిరించారు.

వారి వద్ద సెల్‌ఫోన్లను లాక్కున్నారు. వారందరినీ ఓ గదిలో బంధించారు. ప్లాన్ ప్రకారం వారు చేయాల్సిన పనులు పూర్తి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. టికెట్ కౌంటర్, క్యాంటీన్,  ఆఫీసు రూము, వాష్ రూములను జేసీబీల సాయంతో కూల్చివేశారు. ఈ వ్యవహారం జరుగుతున్న సమయంలో ఆయా వ్యక్తులు విద్యుత్ నిలిపివేశారు. ఆ తర్వాత సీసీకెమెరాలను సైతం ధ్వంసం చేశారు.


థియేటర్ల బాధ్యతలను శ్రీరామ్ అనే వ్యక్తి చూస్తుంటాడు. థియేటర్లు కూల్చివేతపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే థియేటర్ మేనేజ్‌మెంట్‌లో కొందరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం వల్లే ఇదంతా చోటు చేసుకుందని అంటున్నారు. ఎంత అభిప్రాయ బేధాలున్నా థియేటర్లను కూల్చివేతకు పాల్పడరని అంటున్నారు.

ALSO READ: ట్వీటు వీరుడు జగన్.. కేటీఆర్‌ని ఫాలో అవుతున్నారా?

దీనివెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ స్థాయిలో డ్యామేజ్ చేస్తారని తాము ఊహించలేదని అంటున్నారు. పైన చెప్పిన విషయాలను థియేటర్ ప్రతినిధి శ్రీరామ్ తెలిపాడు. మొత్తానికి థియేటర్ల ధ్వంసం వెనుక ఎవరి హస్తముందో చూడాలి.

 

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×