Gundeninda GudiGantalu Today episode june 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనిక కోసం ఊరంతా గాలిస్తూ ఉంటాడు సంజయ్.. ఇది చెప్పకుండా ఎక్కడికి వెళ్లింది చచ్చిపోయిందా? లేక అవమానం తట్టుకోలేక ఎక్కడికైనా పారిపోయిందా? అని ఆలోచిస్తూ ఉంటాడు. సంజయ్ కు ఏమైంది ఎవరి కోసం వెతుకుతున్నాడని ఆరా తీస్తాడు. సంజు పై అనుమానంతో బాలు ఒక వ్యక్తిని అడిగితే అతను ఒక అమ్మాయిని వెతుకుతూ వచ్చాడని చెప్తాడు. మౌనికకు ఏమైంది అసలు ఈ దుర్మార్గుడు ఏం చేశాడు అంటూ భయంతో కంగారు పడుతూ మౌనిక వాళ్ళ ఇంటికి బాలు వస్తాడు. సువర్ణను అడుగుతాడు. ఈ దుర్మార్గులు ఏం చేశారో చెప్పండమ్మా మీకు మాత్రమే తెలుసు ఉంటుంది .. మీరు ఇలా చెప్తేనే నిజం చెప్పరు కానీ అని మెడ మీద కత్తి పెట్టి నిజం చెప్పమని సంజయ్ ని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మౌనిక అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాను అని అంటుంది. నువ్వు కనిపించలేదని వీడు ఫోటో పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు..అందుకే నీకు ఏదైనా అయిందేమో అని నేను టెన్షన్ పడుతూ వచ్చేసానమ్మ అని మౌనికతో బాలు అంటాడు. ప్రభావతి రాత్రి అందరికి చుక్కలు చూపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి ప్రభావతికి ఫేస్ ప్యాక్ వేస్తుంది. రాత్రి అంతా అలానే ఉంటే బాగుంటుందని చెప్తుంది. అనుకోకుండా రాత్రి కరెంటు పోవడంతో ప్రభావతిని చూసి అందరూ దయ్యమని భయపడతారు.. రాత్రిపూట ఇలాంటి ప్రయోగాలు ఏంటి అని అందరూ కంగారుపడుతూ ఉండడం చూసి సత్యం అరుస్తాడు. నీ ఫేస్ ప్యాక్ లు పిచ్చి తో పిల్లల్ని భయపడతావని సత్యం ప్రభావతి పై అరుస్తాడు.. ఫ్యూజ్ పోయిందని బాలు ఫ్యూజ్ వేస్తాడు. ఆ తర్వాత సత్యం ప్రభావతిని ఆ మొహానికి ఉన్నది కడుక్కొని వస్తేనే లోపలికి రాణిస్తాను లేకపోతే రానీవ్వను అని వార్నింగ్ ఇస్తాడు.
ఇక ఉదయం పూలమాలల కోసం పూలు కొనడానికి మీనా బాలు ఇద్దరు ఆటో వేసుకొని మార్కెట్ కి వెళ్తారు. దారి మధ్యలో మీనాపై బాలు సెటైర్ వేయడంతో మీనా అలిగి అడ్వాన్స్ వెనక్కి తీసుకోండి.. నేను పూలమాలలు కట్టను అనేసి అంటుంది.. నా మాట పోతుంది నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను అనేసి బాలు మీనాకు లొంగిపోతాడు. నువ్వు కస్టమర్వి నేను ఆటో డ్రైవర్ని ఇక వెళ్దామా అనేసి బాలు అంటాడు.. రోడ్డు మీద ఆటోను ఆపాలని బాలు అంటాడు. ఈ పూలన్నీ అక్కడికి ఎవరు మోసుకొని వస్తారు లోపలికి తీసుకెళ్లండి అని మీనా అంటుంది.
ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఆటోని డైరెక్టుగా లోపలికి తీసుకొచ్చావేంటి ఫైన్ కట్టాలని అంటాడు. మేమిద్దరము భార్యాభర్తలం సార్ మా ఆవిడ పూలు కొనాలని ఇక్కడికి తీసుకు రమ్మంటే వచ్చాము అని బాలు అంటాడు. మీన మాత్రం ఆయన ఒక డ్రైవర్ ఆయన భార్యను నేను ఎందుకు అవుతాను.. ఇది మా ఆయన వింటే ఫీల్ అవుతాడు కదా అని అంటుంది. ఆ తర్వాత మీనాకు తెలిసిన ఒక ఆవిడ వచ్చి వీళ్ళిద్దరూ భార్యాభర్తలని ట్రాఫిక్ కానిస్టేబుల్ తో అనడంతో అతను వదిలేసి వెళ్ళిపొమ్మని చెప్తాడు. ఇక దారిలో టీ తాగాలని చెప్పి నేను అంటుంది.
శృతి రవి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు.. అయితే ప్రభావతి వీరిద్దరూ నిజంగానే గొడవ పడుతున్నారేమో అని అనుకుంటుంది.. ఆ విషయాన్ని సత్యంతో చెప్తుంది కానీ సత్యం మాత్రం వాళ్ల గొడవ మనకెందుకు నువ్వు మధ్యలో కలగ చేసుకోవద్దు అనేసి అంటాడు.
కానీ ప్రభావతి మాత్రం వినకుండా శృతిని ఈరోజు ఎలాగైనా అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. శృతి రాగానే మీరిద్దరూ గొడవ పడుతున్నారా అని అడుగుతుంది. మేమేం గొడవ పడట్లేదు అంటి చిన్న చిన్నగా సరదాలు సరసాలు ఉంటాయి కదా మేం కూడా అలాగే కామెడీగా గొడవ పడుతూ ఉంటామని శృతి అంటుంది. అలాగే రవి కూడా సమాధానం చెప్పడం తో ప్రభావతి షాక్ అవుతుంది.. శృతి రవి ఇద్దరు వెళ్తూ బయట సరదాగా ఉండటం చూసి ఈ అమ్మాయి స్పీడును చూస్తుంటే నాకు భయమేస్తుంది అని ప్రభావతి టెన్షన్ పడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. గుణ మీనా మాలల్ని మండపానికి చేరకుండా చేయాలని తన మనుషులకి వార్నింగ్ ఇస్తాడు. మరి బాలు ఏం చేస్తాడో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే..