Duvvada Srinivas – Divvala Maduri: ప్రేమికుల రోజు రానే వచ్చింది. ప్రేమకు వయస్సు లేదు.. హద్దులు కూడ ఉండవన్నది నేటి యువత మాట. అందుకే ప్రేమ అనే భావన ఎప్పుడు పుడుతుందో చెప్పడం కష్టమే. కానీ పొలిటికల్ ప్రపంచంలో కూడ ప్రేమికులు ఉన్నారు. రాజకీయం అంటేనే ప్రతి క్షణం ప్రజల కోసం.. ప్రజల ముందు ఉండాల్సిన పరిస్థితి. అలాంటి బిజిబిజీ సమయంలో కూడ ఓ జంట ప్రేమలో పడింది. పొలిటికల్ లవర్స్ అంటూ నెటిజన్ల నుండి పిలువబడుతున్నారు. వారే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ నాయకురాలిగా పిలువబడే దివ్వెల మాధురి.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకరేమో పొలిటికల్ లీడర్.. మరొకరు సాంప్రదాయ నృత్య డ్యాన్సర్. వీరిద్దరి మనసులు పొలిటికల్ ప్రపంచంలోనే కలిశాయి. దువ్వాడ కుటుంబ వ్యవహారం సమయంలో మాధురి తెరపైకి వచ్చారు. ఆ సమయం నుండి నిను వీడని నేనే, నీ కోసం నేనున్నా అంటూ దువ్వాడ వెంట మాధురి ప్రతి చోట కనిపిస్తున్నారు. తాము ప్రేమికులమని, ప్రేమకు వయస్సు అడ్డు కాదంటూ మాధురి పలు ఇంటర్వ్యూలలో తేల్చి చెప్పారు. అలాగే తాము త్వరలో పెళ్లి చేసుకుంటామని కూడ ఈ పొలిటికల్ జంట తేల్చి చెప్పేసింది. అంతేకాదు దువ్వాడ మైనింగ్ వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతో, త్వరలో హైదరాబాద్ లో మాధురి శారీస్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారట.
ఈ జంట నిరంతరం వార్తల్లో నిలవడం విశేషం. మీడియా ఇంటర్వ్యూలకు హాజరై ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇప్పటికే దువ్వాడకు ఇద్దరు కుమార్తెలు సంతానం. మాధురికి ముగ్గురు సంతానం. కానీ వీరిద్దరిని కలిపింది మాత్రం ప్రేమ అనే బంధం అంటారు మాధురి. ఓ ఇంటర్వ్యూలో ఏకంగా తాము గత జన్మ ప్రేమికులమని, అది ఈ జన్మలో ఇలా రాసి పెట్టిందంటూ మాధురి అన్నారు. అంతటితో ఆగక దువ్వాడ రాజకీయ వారసత్వం కొనసాగించేందుకు ఓ బిడ్డను కూడ అందిస్తానని మాధురి సంచలన కామెంట్స్ చేశారు. తమ వివాహానికి అందరినీ ఆహ్వానిస్తామని, చాటుగా వివాహం జరగదని ఈ జంట తేల్చి చెప్పేసింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఒకరినొకరు ప్రేమ ప్రతిజ్ఞ కూడ చేశారు. జీవితాంతం దువ్వాడ చేయి విడువనంటూ.. అన్ని కష్టాలలో సహ ధర్మచారిణిగా అండగా ఉంటానని దువ్వాడ చేతిలో చెయ్యేసి మాధురి ఒట్టేశారు. అదే స్థాయిలో దువ్వాడ.. తన కష్టాలలో అండగా నిలిచిన మాధురికి ఏమిచ్చి రుణం తీర్చుకోను అంటూ తన మనస్సులోని భావాన్ని వ్యక్తం చేశారు. ఇలా వీరిద్దరి ఇంటర్వ్యూస్ లవర్స్ డే సంధర్భంగా వైరల్ గా మారాయి.
Also Read: Bank Holiday Eid Ul Fitr : పండుగ రోజు సెలవు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ తాజా ఉత్తర్వులు
ప్రేమకు వయస్సు లేదు అనే మాట పొలిటికల్ జంటకు కరెక్ట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. న్యాయపరమైన అంశాలు అడ్డు ఉన్నాయని, అవి వీడిన వెంటనే వివాహం జరుపుకుంటామని అంటున్న పొలిటికల్ లవర్స్ దువ్వాడ, దివ్వెల మాధురికి ఆల్ ది బెస్ట్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా లవర్స్ డే రోజు దువ్వాడకు, మాధురికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వెల్లువ సాగుతోంది.