E-Paper
Advertisement

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మరో కేసు నమోదు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మరో కేసు నమోదు
Advertisement

Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్‌ తగిలింది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు న మోదు చేశారు.

సునీల్ తెలిపిన వివరాల ప్రకారం, 2024 జులైలో వంశీతో పాటు ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మళ్లీ అరెస్టు తప్పదా?

Advertisement

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, టీడీపీ కార్యకర్త కిడ్నాప్ సహా పలు కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. తాజాగా మరో కేసు నమోదు కావడంతో వంశీని మళ్లీ అరెస్టు చేస్తారా? అంటూ చర్చలు మొదలయ్యాయి. టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 16న వంశీని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పలు కేసులు వరుసగా నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ వంశీపై 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వంశీ ఇప్పటి వరకూ 140 రోజులు జైలులో గడిపారు. తాజాగా మరో కేసు నమోదు కావడంతో చర్చ మొదలైంది.

Also Read: Chandrababu Naidu: ఈ అవార్డు క్రెడిట్ నాది కాదు.. అధికారులదే: ‘బిజినెస్‌ రిఫార్మర్’ పురస్కారంపై సీఎం చంద్రబాబు

Advertisement

వల్లభనేని వంశీ ఇప్పటికే పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. దళిత యువకుడు సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌, బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై వంశీపై పలు కేసులు ఉన్నాయి.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×