Vangalapudi Anitha Missed Road Accident:: ఏలూరు జిల్లాలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఏలూరు జిల్లా ఉంగనూరు మండలం కైకరం వద్ద రోడ్డుపై ఎదురుగా ఓ బైక్ సడెన్‌గా దూసుకురావడంతో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్..బైక్ ను తప్పించే క్రమంలో అకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి కారుతో పాటు ఎస్కార్ట్ స్వల్పంగా దెబ్బతిన్నాయి.
అయితే, విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురానికి ఏపీ హోంమంత్రి అనిత వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్, మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో మంత్రి అనిత మరో వాహనంలో వెళ్లారు. మంత్రికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.