Video Call Leaks BJP Leaders resign: ఏపీకి చెందిన బీజేపీకి చెందిన నాయకుల రాసలీలల వీడియో సోసల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, మీడియా ప్యానలిస్ట్ రామకృష్ణలు ఓ మహిళతో వీడియో కాల్ ద్వారా చేసిన అసభ్యకర న్యూడ్ కు సంబంధించిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళతో వాళ్లు చేసే వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇది కాస్తా ఆ ఇద్దరి నేతల పదవులపై ఎఫెక్ట్ పడింది. గత రెండు రోజులుగా కలకలం సృష్టిస్తున్న ఈ వీడియో వ్యవహారంపై రాష్ట్ర అధిష్టానం సీరియస్ అయింది. ఇద్దరిని విచారణకు పిలిచి రాజీనామాలు చేయించింది. అనంతరం ఇద్దరు తమ పదవులకు రాజీనామాలు చేయగా.. బీజేపీ రాష్ట్ర అధిష్టానం సైతం వాటిని ఆమోదించింది. అలాగే వీరితోపాటు సోషల్ మీడియాల్లో ప్రస్తావనకు వచ్చిన బీజేపీ మహిళా నేత సుకన్యను సైతం సస్పెండ్ చేసింది.
ఇదిలా ఉండగా, ఏపీలో రాజకీయ నాయకులు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఇదేం కొత్తేమి కాదు. గతంలోనూ కొంతమంది గుట్టు బట్టబయలైంది. 2002లో వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇలానే రాసలీలల వీడియోలు బయటకు వచ్చాయి. ఓ మహిళతో వీడియోలో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోపై మాధవ్ ఫేక్ అంటూ ఆరోపణలు చేశాడు.
Also Read: కేబినెట్ భేటీలో కనిపించని పవన్.. అసలు కారణం ఇదే !
2022లో తన డ్రైవర్‌ను హత్య చేసినందుకు ఇప్పటికే విచారణలో ఉన్న వైసీపీ ఎంఎల్సీ ఒకరు కూడా అసభ్యకరమైన వీడియోలో పట్టుబడ్డారు. అందులో ఆయన కూడా నగ్నంగా కనిపించారు. వైసీపీ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వాసి ఒకరు కూడా ఫోన్ లో హస్కీ సంభాషణ చేసిన వార్త వైరల్ అయింది.
అలాగే, 2022లో వైసీసీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ ను హత్య చేశాడు. ఈ కేసు విచారణలో ఉన్న అతను కూడా ఇలాంటి వీడియోల్లో బయటపడ్డాడు. ఇలా వైసీసీ నేతలు అసభ్యకర వీడియోలో బయటపడగా.. తాజాగా, బీజేపీ నాయకులు పడడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.