Indian Cricketers Salary: రంజి ట్రోఫీ మొదటి దశ 2024 సంవత్సరం చివరలో జరగగా.. 2025 జనవరి 23 నుండి రంజీ ట్రోఫి రెండవ అర్థ భాగం ప్రారంభం అయింది. దేశవాళి క్రికెట్ లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, యశస్వి జైష్వాల్, గిల్, శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, శివం దుబే.. ఇలా చాలామంది ఆటగాళ్ల ప్రదర్శనలు చూస్తున్నాం. జనవరి 30 నుండి విరాట్ కోహ్లీ కూడా ఇందులో భాగం కానున్నాడు.
Also Read: Shardul Thakur: టీమిండియాలో మరో డేంజర్ ఆలౌ రౌండర్.. 8వ స్థానంలో సెంచరీలు ?
అయితే ఇందులో చాలామంది సీనియర్ ఆటగాళ్లు విఫలమవుతున్నారు. రంజీల్లో కూడా ఆశించినంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. చాలాకాలం తర్వాత రంజీ ట్రోఫీలో ఆడేందుకు వచ్చిన ఈ ప్లేయర్స్ తమ తమ సొంత జట్లకు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నారు. ఇదిలా ఉంటే.. రంజి ట్రోఫీ రెడ్ బాల్ క్రికెట్ లో కీలక టోర్నమెంట్ గా పరిగణిస్తారు. బీసీసీఐ కూడా ప్రతి ఆటగాడు రంజీ ట్రోఫీలలో పాల్గొనాలని నొక్కి చెప్పింది. అయితే రంజీ ట్రోఫీలలో పాల్గొనే ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ కి ఎంత సంపాదిస్తారో తెలుసా..?
టీమ్ ఇండియాకు ఆడే ప్లేయర్స్ వార్షిక కాంట్రాక్టుల రూపంలో కోట్ల రూపాయల జీతం అందుకుంటారు. ఇది కాకుండా మ్యాచ్ ఫీజు తీసుకుంటారు. అయితే రంజీ ట్రోఫీలో ఆటగాళ్లు మ్యాచ్ రోజు ఆధారంగా డబ్బు సంపాదిస్తారు. ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్ లు సాధారణంగా నాలుగు రోజులపాటు జరుగుతాయి. అలాగే నాకౌట్ మ్యాచ్ లు టెస్ట్ మ్యాచ్ ల మాదిరిగా ఐదు రోజులపాటు జరుగుతాయి. ఈ రంజీ ట్రోఫీలో ఆడే ప్లేయర్స్ వారి అనుభవాన్ని బట్టి వేరువేరుగా రోజువారి జీతాలను పొందుతారు.
అంతేకాకుండా ఈ టోర్నీలో ఆడడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఆటగాళ్లు తమ పాత ఫామ్ ని తిరిగి పొందేందుకు ఈ టోర్నీలు సహాయపడతాయి. అలాగే ఆర్థికంగా కూడా మంచి డబ్బు వచ్చి పడుతుంది. ఈ రంజీ ట్రోఫీలో ఆడే ప్లేయర్స్ కి బీసీసీఐ మూడు స్లాబ్ లలో జీతం ఇస్తోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. 41 కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్స్ ప్లేయింగ్ ఎలివేన్ లో భాగమైతే రోజుకు రూ. 60 వెలు అందుకుంటారు. ఇలా నాలుగు రోజుల్లో.. అంటే ఒక్క మ్యాచ్ కి రూ. 2.40 లక్షలు సంపాదిస్తారు.
Also Read: Mohammed Shami: షమీకి మళ్లీ గాయం.. ఇంగ్లాండ్ సీరిస్ నుంచే దూరం ?
ఉదాహరణకి రోహిత్ శర్మ నాలుగు రోజుల మ్యాచ్ ఆడినందుకు 2.40 లక్షలు అందుకుంటాడు. ఇక రిజర్వ్ ఆటగాళ్లకు రోజుకు రూ. 30 వేలు ఇస్తారు. 21 నుండి 40 మ్యాచ్ ల అనుభవం ఉన్న ప్లేయర్స్ రోజుకు రూ. 50 వేలు అందుకుంటారు. అంటే మ్యాచ్ కి రెండు లక్షల వరకు సంపాదిస్తారు. ఈ కేటగిరీకి చెందిన రిజర్వ్ ప్లేయర్స్ రోజుకు 25 వేలు పొందుతారు. ఇక 20 కంటే తక్కువ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు రోజుకు రూ. 40 వేలు. అంటే ఒక మ్యాచ్ కి రూ. 1.60 లక్షలు తీసుకుంటారు. రిజర్వ్ ఆటగాళ్లకు రోజుకు రూ. 20 వేలు.