BigTV English

Vijayawada Floods: అయ్యా.. ఆదుకోండి, చిన్న పిల్లలతో చిక్కుకున్నాం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Vijayawada Floods: అయ్యా.. ఆదుకోండి, చిన్న పిల్లలతో చిక్కుకున్నాం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Vijayawada Floods Viral Video: ఓ వైపు బుడమేరు, మరోవైపు కృష్ణా.. లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన కృష్ణానది కంటే.. కట్టతెంచుకున్న బుడమేరు వాగు నుంచి పొంగిన వరదే విజయవాడను ముంచేసింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు పునరావాస కేంద్రాలకు బోట్ల సహాయంతో తరలిస్తున్నాయి. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లక్షలాదిమంది నిరాశ్రయులై.. పాలు, నీళ్లు, ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు.


కంటైనర్లు, డ్రోన్లు, హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లను పంపిణీ చేస్తుండగా.. జనం ఆకలి కేకలు పెడుతున్నారు. కంటైనర్ కనిపించడమే ఆలస్యం.. దాని చుట్టు గుమిగూడి.. మా పిల్లలకు పాలు కావాలి.. ప్లీజ్ ఒక్క ప్యాకెట్ ఇవ్వండి.. మేం అన్నం తిని రెండ్రోజులైంది.. అన్నం పెట్టండి సార్.. అని అడుగుతున్న దృశ్యాలు నెట్టింట కనిపిస్తుంటే.. అచేతనంగానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎన్నడూ లేని అతిభారీ వర్షాలతో విజయవాడ వాసులు.. తిండి తిప్పలు లేని దీన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.

Also Read: పూర్తికాని ట్రాక్ రిపేర్ పనులు.. మరో 28 రైళ్లు రద్దు


తాజాగా.. బిగ్ బాస్ 7 ఫేం, యూట్యూబర్ టేస్టీ తేజ ఒక వీడియో తన ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో చైతన్య అనే వ్యక్తి.. తాము వరదలో చిక్కుకుపోయామని, తమను ఆదుకోవాలని కోరుతున్నాడు. విజయవాడలో అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ సమీపంలోని వైఎస్సార్ కాలనీలో ఉంటున్నామని, తమ ఇంటిని వరద చుట్టుముట్టిందన్నారు. ఇప్పటి వరకూ ఎంతోమంది అధికారులకు వాట్సాప్ లో మెసేజ్ లు పెట్టి, కాంటాక్ట్ చేశామని ఎవరూ స్పందించలేదని వాపోయారు.

10 రోజుల క్రితమే పుట్టిన బిడ్డ, పాప, హార్ట్ పేషంట్స్, పసిపిల్లలు, ఆడవాళ్లు, అంతా ఇరుక్కుపోయామని, మూడురోజులుగా తిండి, నీరు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. పసిపిల్లల ఆకలిని తీర్చేందుకు కూడా పాలు, నీళ్లు లేవని ఆవేదన చెందారు. కరెంట్ కూడా లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయిపోతుందన్నారు. అధికారులు వీలైనంత త్వరగా తమను సురక్షిత ప్రదేశానికి తరలించాలని వేడుకున్నారు చైతన్య. 916013339, 8977273699 నంబర్లకు కాల్ చేస్తే అడ్రస్ చెబుతామన్నారు. లేదంటే శ్రీ నాగలక్ష్మీ నిలయం, అమూల్ ఐస్ క్రీమ్ బిల్డింగ్, R.S.259/5, plot no , పాముల కాలవ, క్యాపిటల్ వే అపార్ట్ మెంట్, జక్కంపూడి రోడ్ అడ్రస్ కు వచ్చి తమను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

 

View this post on Instagram

 

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×