BigTV English

Telangana Andhra Floods: తెలుగు రాష్ట్రాలకు చేయూత.. విరాళాలు ఇచ్చిన సెలబ్రిటీలు వీళ్లే!

Telangana Andhra Floods: తెలుగు రాష్ట్రాలకు చేయూత.. విరాళాలు ఇచ్చిన సెలబ్రిటీలు వీళ్లే!

Telangana Andhra Floods Celebrities donated: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన వర్షాలకు 25కి పైగా మృత్యువాత పడ్డారు. వర్షం కారణంగా పలు ప్రాంతలు జలమయం కావడంతో రోడ్డు, రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి. అనేక లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్ అంతరాయం కూడా ఏర్పడింది.


ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వరదలు ప్రభావంతో చాలామంది నిరాశ్రయులుగా మారారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం వరద బాధితులకు తక్షణ సహాయం కింద నగదు ప్రకటించారు.

తాజాగా, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, ఎస్.నాగవంశీలు విరాళాలు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.


గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ(చినబాబు), ఎస్.నాగవంశీలు సంయుక్తంగా రూ.50లక్షలు విరాళం ప్రకటించారు.ఈ మేరకు ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.

భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంతగానో కలచివేశాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతు సాయంగా చేయూత అందిస్తున్నామంటూ ఒక ప్రకటనలో తెలిపారు.

అంతే కాకుండా, మరో టాలీవుడ్ నటుడు సిద్దు జొన్నలగడ్డ రెండు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించాడు. తెలంగాణ, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి చెరో రూ.15 లక్షలు ప్రకటించాడు.

ఇదిలా ఉండగా, ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి పలువురు సెలబ్రిటీలు విరాళాలు ప్రకటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ రూ. 25లక్షలు ఏపీ సీఎం సహాయ నిధికి విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు రేపటి కోసం అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఆయ్ సినిమా కూడా విరాళం ఇచ్చింది. ఈ మూవీకి ఈ వారాంతపు వచ్చే కలెక్షన్లలో నిర్మాత షేర్‌లో 25 శాతాన్ని జనసేన పార్టీ తరఫున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.

Also Read: ‘దేవ’ పేరుతో స్టార్ హీరోల సినిమాలు.. అంత క్రేజ్ ఉందా, లిస్ట్ ఇదే?

అలాగే, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించారు. తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.50 లక్షలు, ఏపీ సీఎం సహాయనిధికి రూ.50లక్షలు ప్రకటించారు. విశ్వక్ సేన్ కూడా ఇరు రాష్ట్రాలకు రూ. 10 లక్షలు ప్రకటించాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×