E-Paper
Advertisement

సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు.. సిఐ నాగరాజుని అరెస్ట్ చేయవద్దని ఆందోళన, ప్రభుత్వం సిట్ ఏర్పాటు

సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు.. సిఐ నాగరాజుని అరెస్ట్ చేయవద్దని ఆందోళన, ప్రభుత్వం సిట్ ఏర్పాటు
Advertisement

Vijayawada: విజయవాడ సాయికృష్ణ కేసు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆదివారం సీఐ నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు పెద్ద డ్రామానే సాగింది. ఆయన్ని అరెస్ట్ చేయవద్దని ఓ వర్గం ఆందోళనకు పిలుపు ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగింది?

విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు

Advertisement

విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సిఐ నాగరాజుని అరెస్ట్ చేయవద్దని ఆందోళనకు దిగారు స్థానికులు. సీఐ నాగరాజు నివాసం ఉంటున్న ప్రాంతంలో ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలు, నినాదాలు చేశారు.

సిఐని అరెస్ట్ చేస్తే విజయవాడతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సిఐ నాగరాజు వల్ల లబ్ధి పొందిన వారంతా తరలి రావాలని పిలుపు ఇచ్చారు. సీఐకి మద్దతుగా పలువురు అక్కడికి చేరుకున్నారు. సీఐ వచ్చిన తర్వాత విజయవాడలో గంజాయి నివారణ చర్యలు చేపట్టారని చెబుతున్నారు స్థానికులు.

Advertisement

సిఐ నాగరాజుని అరెస్ట్ చేయవద్దని ఆందోళన.. నలుగురు సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు

అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలిని పలువురు తప్పుబట్టారు. తెలంగాణలో ఎన్కౌంటర్ చేస్తే జగన్ అభినందించారని అంటున్నారు. ఇప్పుడు నాగరాజు తప్పు చేసేవాళ్ళని శిక్షిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. జగన్ తీరుపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదిలాఉండగా విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసులో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణకు నలుగురు సభ్యులతో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ రవిప్రకాశ్‌ ఆధ్వర్యంలో మరో ముగ్గురు సభ్యులుగా ఉండనున్నారు. పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలు, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ALSO READ: టెక్నాలజీకే కాదు.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీ.. యోగా గురు బాబా రాందేవ్‌‌తో సీఎం చంద్రబాబు యోగాసనాలు 

అంతకుముందు ఈ కేసు విచారణ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిగిన విషయం తెల్సిందే. సాయికృష్ణ అదృశ్యంపై రకరకాల ఆరోపణలు వెల్లువెత్తడంతో కృష్ణలంక స్వర్గపురిలో యువకుడి మృతదేహాన్ని కాల్చారంటూ  వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి అధికారులు వివరాలు సేకరించారు.

వారి కాల్ డేటా, రికార్డులను పరిశీలించారు. గుర్తు తెలియని మృతదేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరు తీసుకొచ్చారు? వాటికి అనుమతులు ఉన్నాయా? లేవా? అనే వివరాలు తీసుకున్నారు. ఈ కేసులో సిట్ ఎంటర్ కావడంతో మరిన్ని విషయాలు లోతుగా విచారణ చేపట్టనుంది.  ఇంటి నుంచి సాయికృష్ణను ఎవరు తీసుకొచ్చారు? కృష్ణలంక పీఎస్ కు ఎప్పుడు వచ్చాడు? వాటిపై దర్యాప్తు చేయనుంది.

Related News

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

Big Stories

Advertisement
×