E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అదిరిపోయే ఫీచర్లు.. ఆకట్టుకునే రేంజ్.. హోండా క్యూట్ ఈవీ వచ్చేసింది!

అదిరిపోయే ఫీచర్లు.. ఆకట్టుకునే రేంజ్.. హోండా క్యూట్ ఈవీ వచ్చేసింది!
Advertisement

Honda’s Cheapest EV: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా, కొత్త ఎలక్ట్రిక్ కారు సూపర్-ఎన్ ను మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ఇవాళ్టి నుంచి (జూన్ 22) ప్రారంభం కానున్నాయి. దీని ప్రారంభ ధర దాదాపు రూ.22 లక్షలు(£18,995)గా నిర్ణయించింది. అయితే, ఈ కారును ప్రస్తుతం యూకేలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ధరతో బ్రిటన్‌ లో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది.  హోండా ఇప్పటికే హోండా e, e:Ny1 మోడళ్లను నిలిపివేయడంతో, ప్రస్తుతం యూకేలో కంపెనీ అమ్ముతున్న ఏకైక ఎలక్ట్రిక్ కారుగా సూపర్-ఎన్ గుర్తింపు తెచ్చుకుంది. గతంలో హోండా e ఆశించిన స్థాయిలో సేల్ కాలేదు. ఈ కొత్త మోడల్‌పై కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది.

తక్కువ బరువు.. మంచి సామర్థ్యం

సూపర్-ఎన్ హోండా ప్రసిద్ధ కీ-కార్ ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా రూపొందించబడింది. ఈ ప్లాట్‌ ఫారమ్ జపాన్‌ లో చిన్న పరిమాణంలో, ఎక్కువ ఉపయోగకరమైన కార్లకు ప్రసిద్ధి చెందింది. 1980లలో వచ్చిన హోండా సిటీ టర్బో II నుంచి ఈ కారు డిజైన్‌ ను తీసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు బరువు కేవలం 1,097 కిలోలు. సాధారణంగా ఈవీలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇందులో 29.6kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఇచ్చారు. పూర్తి ఛార్జ్‌ తో ఈ కారు 128 మైళ్లు అంటే.. సుమారు 206 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. అయితే, నగరాల్లో ఉపయోగించినప్పుడు దీని రేంజ్ దాదాపు 199 మైళ్లు అంటే.. 320 కి.మీ  వరకు చేరుతుందని హోండా చెబుతోంది. 50kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

డ్రైవింగ్‌ ఎక్స్ పీరియెన్స్ గురించి..

Advertisement

సూపర్ ఎన్‌ ను కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా, డ్రైవింగ్‌ను ఆస్వాదించాలనుకునే వారి కోసం కూడా రూపొందించారు. సాధారణంగా ఈ కారు 47kW పవర్ అందిస్తుంది. అయితే, ఇందులో ఉన్న బూస్ట్ మోడ్ యాక్టివేట్ చేస్తే పవర్ 70kW వరకు పెరుగుతుంది. దీంతో 0 నుంచి 62 mph వేగాన్ని అందుకోవడానికి జస్ట్ 10 సెకన్లు పడుతుంది. ఈ మోడ్‌ లో సిమ్యులేటెడ్ 7 -స్పీడ్ గేర్‌ బాక్స్, ప్రత్యేక ఇంజిన్ సౌండ్, నీలం నుంచి ఊదా రంగులోకి మారే యాంబియంట్ లైటింగ్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

చిన్న కారు.. పెద్ద స్పేస్

సూపర్ ఎన్ పొడవు 3,599 మి.మీ, వెడల్పు 1,573 మి.మీ ఉంటుంది. అయినప్పటికీ ఇందులో నలుగురు వ్యక్తులు సౌకర్యంగా ప్రయాణించవచ్చని హోండా తెలిపింది. ఈ కారులోని మ్యాజిక్ సీట్స్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా బూట్ స్పేస్ 162 లీటర్లు ఉండగా, వెనుక సీట్లను మడిచేస్తే అది 967 లీటర్లకు పెరుగుతుంది. ఇది చిన్న ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అత్యుత్తమ బూట్ స్పేస్‌ లలో ఒకటిగా భావిస్తున్నారు.

అత్యాధునిక ఫీచర్లు

Advertisement

కారు లోపల సపోర్టివ్ సీట్లు, నీలం రంగు హైలైట్స్, యాంబియంట్ లైటింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, బోస్ సౌండ్ సిస్టమ్,  హోండా సెన్సింగ్ డ్రైవర్ అసిస్టెన్స్ లాంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధర, సరదా డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్, మంచి రేంజ్, విశాలమైన ఇంటీరియర్‌ తో హోండా సూపర్ ఎన్ యూకే మార్కెట్లో చిన్న ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో గట్టి పోటీని ఇవ్వడానికి రెడీ అవుతోంది.

Read Also: ఓలా, ఉబెర్, ర్యాపిడోలో నెలకు అంత సంపాదింవచ్చా? ఇవిగో లెక్కలు!

Related News

E20 పెట్రోల్‌ పై కొత్త వివాదం.. చీమల కథలో నిజమెంత?

70/30 బ్రేక్ రూల్.. సేఫ్ రైడింగ్‌ కోసం ప్రతి బైక్ రైడర్ తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

ఓలా, ఉబెర్, ర్యాపిడోలో నెలకు అంత సంపాదింవచ్చా? ఇవిగో లెక్కలు!

గుంతల రోడ్లపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణం.. నడుము నొప్పి రానీయని 5 క్రేజీ బైక్స్ ఇవే!

టాటా సియెర్రా సంచలనం.. ఒకేసారి మూడు కొత్త వెర్షన్లతో ఎంట్రీ!

బెడ్‌లా మారే సీట్లు, 548 కిమీ రేంజ్.. ప్రభుదేవా కొత్త కారు చూస్తే మతిపోవాల్సిందే!

ఏథర్ స్కూటర్లకు ఎందుకు అంత క్రేజ్.. ఈ 5 స్మార్ట్ ఫీచర్లే కారణం!

Big Stories

×