BigTV English

Vijaysai: విజయసాయి ఐఫోన్ మిస్సింగ్.. అందుకేనా..?

Vijaysai: విజయసాయి ఐఫోన్ మిస్సింగ్.. అందుకేనా..?

Vijaysai: ఫోన్లు పోవడం కామన్. అయితే, ప్రముఖుల ఫోన్లు పోవడమనేది అస్సలే కామన్ కాదు. అందులోనూ, అల్లుడు అరెస్టై.. సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న కీలక సమయంలో ఫోన్ పోవడం మరింత అనుమానాస్పదం అంటున్నారు. ఇంకెవరు, ఇద్దంతా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించే.


ఈ నెల 21 నుంచి విజయసాయిరెడ్డికి చెందిన ఐ ఫోన్ 12ప్రో కనిపించడం లేదంటూ.. ఆయన పీఏ లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫోను పోయిన సమయం, సందర్భం.. ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తోంది.

ఇదే ఛాన్స్ గా టీడీపీ సెటైర్లు వేస్తోంది. అవునా, విజయసాయిరెడ్డి తాడేపల్లి ఎప్పుడు వెళ్లారు? ఈ నెల 21న ఆయన తాడేపల్లిలో ఉన్నట్టు ఎక్కడా అప్ డేట్ కూడా లేదు. ఇంతకీ ఫోన్ పోయిందా? లేదంటే, జగన్ లాగేసుకున్నారా? అంటూ ఓ టీడీపీ మాజీ మంత్రి పంచ్ లు వేశారు. ఫోన్ దాచేసి పోలీసులకు పోయిందంటూ ఫిర్యాదు చేశారనేది ఆ పార్టీ నేతల ఆరోపణ. మరి, ఫోన్ ఎందుకు దాచేశారో కూడా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.


ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో సీబీఐ విచారణ లోతుగా సాగుతోంది. ఆ లిక్కర్ స్కాం లింకులు విజయసాయిరెడ్డికి ఉండబట్టే.. సీబీఐ వాళ్లు తన ఫోను సీజ్ చేస్తే గుట్టంతా రట్టు అవుతుందనే భయంతోనే ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు చేసి నాటకం ఆడుతున్నారనేది టీడీపీ ఆరోపణ. నిజమో కాదో తెలీదు కానీ.. నిజమే అన్నట్టుగా ఆ ప్రచారం సాగుతోంది.

Tags

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×