Ganta Vs Vishnu: ఏపీలో కూటమి నేతల మధ్య చిన్నిచిన్న విబేధాలు తెరపైకి వస్తున్నాయి. ఒకప్పుడు గుట్టుగా సాగే ఈ వ్యవహారం రచ్చకు దారితీస్తోంది. ఇంతకీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు- బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య విబేధాలేంటి? గంటా ఆగ్రహానికి కారణమేంటి? ఎందుకు విష్ణుకుమార్ రాజు క్షమాపణలు చెప్పారు. అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆ మంట ఇప్పటిదికాదు
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. విశాఖ ఫిలింనగర్ క్లబ్‌కు గత ప్రభుత్వం భూములు కేటాయించింది. దీనికి సంబంధించి కలెక్టర్‌కు విష్ణుకుమార్ రాజు లేఖ ఇవ్వడంలో పొరపాటు జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారం నేపథ్యంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గంటా శ్రీనివాసరావు-విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
తన సంతకం లేకుండా తన నియోజకవర్గానికి సంబంధించిన అంశంపై కలెక్టర్‌కు లేఖ ఎలా ఇస్తారంటూ సదరు బీజేపీ ఎమ్మెల్యేపై గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గంటా వెళ్లి పోయిన తర్వాత మీడియాతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు. ఫిల్మ్ క్లబ్ కు ఐదు ఎకరాల భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. అలాట్ మెంట్ లెటర్‌లో ‘33 ఏళ్లు’ అనేది మిస్సయ్యింది. దీనిపై కరెక్షన్ చేయడానికి కలెక్టర్ ని కలిసి లేఖ ఇచ్చామన్నారు.
ఈ లెటరు అప్పటికప్పుడు తయారు చేసిందని, ఆ సమయంలో ఎమ్మెల్యే గంటా అక్కడ లేరన్నారు. పద్దతి ప్రకారం స్థానిక ఎమ్మెల్యే సంతకం తీసుకుని కలెక్టర్‌కి ఇవ్వాలని గుర్తు చేశారు. దీనివల్ల గంటాకు క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. ఇక్కడితో ఇరువురు ఎమ్మెల్యేల మధ్య విబేధాలకు దాదాపు ఫుల్‌స్టాప్ పడినట్టేనని అంటున్నారు.
ALSO READ: డీఎస్సీ అభ్యర్థులకు మరిన్ని కష్టాలు.. ముందుకు ఎలా?
నార్మల్‌గా గంటా శ్రీనివాసరావు-విష్ణుకుమార్ రాజుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు ముంటుందని విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజల మాట. ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే. దాన్ని ఆయన కంచుకోటగా మార్చుకున్నారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ-బీజేపీ అభ్యర్థిగా రాజు గెలుపొందారు. ఆనాటి నుంచి నియోజకవర్గంలో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.
2019లో అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు, టీడీపీ నుంచి గంటా, వైసీపీ నుంచి కేకేరాజు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గంటా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో గంటా వర్సెస్ రాజుకు మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరినొకరు ముఖం చూసుకునే స్థాయికి వెళ్లిపోయింది. విబేధాల గురించి ఇరువురు నేతలు తమ సన్నిహితుల వద్ద చెప్పేవారు.
మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం లేదు..రాలేదు కూడా. ఈ నేపథ్యంలో విశాఖలో కార్పొరేషన్ మేయర్ ఎన్నికల సందర్భంగా విష్ణుకుమార్ రాజుపై గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. పైకి ఇరువురు నేతల మధ్య విబేధాలు సమిసిపోయినా, లోలోపల మాత్రం మంట రగులుతూనే ఉంటుందని అంటున్నారు ఆ నియోజకవర్గం నేతలు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.