డబ్బులు ఇవ్వకుంటే హనీ ట్రాప్ భాధితులను చంపడానికి కూడా వెనకాడని జాయ్ జెమీమా పెద్ద గ్యాంగ్‌నే మెయింటెన్ చేస్తూ.. ఎప్పటికప్పుడు స్కెచ్‌లు వేస్తోంది. జెమీమా నెట్ వర్క్ చూసి పోలీసులు షాక్ అవుతున్నారు. హనీ ట్రాప్ కేసులో విశాఖలోని పలు స్టేషన్‌లకు క్యూ కడుతున్నారు. తాజాగా హనీట్రాప్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. జాయ్ జమీమా చేతిలో హనీ ట్రాప్ గురైన అమెరికాకు చెందిన బాధితుడి తల్లి పోలీసులకు మద్దతుగా నిలిచారు.
Also Read: నాగబాబుపై ట్రోలింగ్స్.. కూటమిలో సెగలు మొదలయ్యాయా?
ఇన్‌స్టాగ్రామ్‌లో తన కొడుక్కి పరిచయమైన జాయ్ జెమీమా.. విశాఖలో ఉన్న తమ వ్యాపారాన్ని చూసుకుంటానని నమ్మబలికిందని అన్నారు. అందుకు తాను నిరాకరించడంతో.. పరిచయమైన వారం రోజుల్లోనే అమెరికాలో ఉంటున్న తన కొడుకుని.. పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టిందన్నారు. అమెరికా నుంచి తమ కొడుకుని పిలిపించి.. జ్యూస్‌లో మత్తు మందు కలిపి తన ఇంట్లోనే ఉంచిందని వాపోయారు. చివరికి తమ కుమారుడు చెప్పడంతో.. పోలీసులను ఆశ్రయించి.. ఆమె బారి నుంచి తమ కొడుకుని కాపాడుకోగలిగామన్నారు.