7 Days Beauty Challenge: చలికాలంలో చర్మం చాలా పొడిగా మారుతుంది. అంతే కాకుండా చర్మంపై పగుళ్లు కూడా ఏర్పడతాయి. అందుకే ఈ సీజన్‌లో స్కిన్ కేర్ పాటించడం చాలా ముఖ్యం. గ్లోయింగ్ స్కిన్ కోసం 7 రోజుల ఛాలెంజ్ చాలా బాగా పని చేస్తుంది. ఈ ఛాలెంజ్ పాటిస్తే తప్పకుండా మీ ముఖం కాంతి వంతంగా మారుతుంది. అంతే కాకుండా ముఖం పై మొటిమలు కూడా తగ్గిపోతాయి. చలికాలంలో 7 రోజుల స్కిన్ కేర్ ఎలా పాటించాలి ? 7 రోజుల స్కిన్ కేర్ పాటిస్తే కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Day 1: చర్మాన్ని హైడ్రేట్ చేయండి: చలికాలంలో అత్యంత ముఖ్యమైన విషయం చర్మాన్ని హైడ్రేట్ చేయడం. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి. తద్వారా చర్మం తేమగా ఉంటుంది. అంతే కాకుండా చర్మంపై దుమ్ము, ధూళి లాంటివి పేరుకుపోకుండా కాపాడటంలో మాయిశ్చరైజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్లిజరిన్ లేదా హైలురోనిక్ యాసిడ్ కలిగి ఉన్ మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లను ఉపయోగించండి. మీరు తాజా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో కూడా చర్మానికి ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని లోతుల నుంచి తేమగా చేస్తుంది. ఫలితంగా చర్మం కాంతివంతగా ఉంటుంది.
Day 2: చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం: చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి తేలికపాటి స్క్రబ్ ఉపయోగించండి. తద్వారా చర్మంపై ఉన్న డ్రై స్కిన్ తొలగిపోతుంది.స్క్రబ్ ని రోజుకు 1-2 సార్లు మాత్రమే ఉపయోగించండి. గట్టిగా రుద్దకండి. ఇలా చేస్తే.. చర్మంపై చికాకును కలిగిస్తుంది.తేనె, చక్కెరతో ఇంట్లో స్క్రబ్ తయారు చేసుకోవచ్చు.
Day 3: తేమ కోసం ఫేస్ మాస్క్: వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఫేస్ మాస్క్ ఉపయోగించండి. ఇది చర్మంపై లోతైన తేమను కలిగిస్తుంది. అంతే కాకుండా అలోవెరా , తేనె మాస్క్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా హైడ్రేట్‌గా ఉంచుతుంది. తరుచుగా ఫేస్ మాస్క్ ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం ఫేస్ మాస్కులను వాడటం వల్ల ఉంటుంది.
Day 4 : వేడి నీటి ఉపయోగం: చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం సర్వసాధారణం. కానీ ఇలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న సహజ తేమ తొలగిపోతుంది. ఇలా కాకుండా. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజు స్నానం చేసిన తర్వాత నూనె లేదా మాయిశ్చరైజర్ చర్మంపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది.
Day 5: తగినంత తాగడం అలవాటు చేసుకోండి: చలికాలంలో దాహం తక్కువగా అనిపిస్తుంటుంది. శరీరంలో సరిపడా నీరు లేకపోయినా కూడా చర్మం పొడిగా ఉంటుంది. రోజంతా కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగడానికి ప్రయత్నించండి. ఇది చర్మానికి లోపల నుండి తేమను అందిస్తుంది.
Day 6: సరైన ఆహారం తీసుకోండి: మీరు తినే ఆహారం చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. విటమిన్ E, వాల్‌నట్స్, బాదం, చియా గింజలు , ఆకుపచ్చ కూరగాయలు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు చర్మానికి తేమ, పోషణను అందిస్తాయి.
Also Read: సోంపు తింటే.. మతిపోయే లాభాలు !
Day 7: నిద్ర దినచర్యను మెరుగుపరచండి: తగినంత నిద్ర పొందడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు నిద్రపోయేటప్పుడు శరీరం చర్మాన్ని రిపేర్ చేస్తుంది. నిద్రపోయే ముందు తేలికపాటి నూనెతో మీ ముఖాన్ని మసాజ్ చేయండి . నిద్రపోయేటప్పుడు తేమను కాపాడుకోవడానికి గదిలో తడి టవల్ ఉంచండి. ఈ 7 రోజుల్లో క్రమం తప్పకుండా వీటిని పాటించడం ద్వారా మీరు మీ చర్మం అందంగా మారడాన్ని చూస్తారు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.