BigTV English

Bigg Boss 8 Telugu Promo: బ్రేకప్ స్టోరీలు చెప్పుకున్న కంటెస్టెంట్స్.. పబ్లిక్‌గా ఆ విషయం ఒప్పేసుకున్న నిఖిల్

Bigg Boss 8 Telugu Promo: బ్రేకప్ స్టోరీలు చెప్పుకున్న కంటెస్టెంట్స్.. పబ్లిక్‌గా ఆ విషయం ఒప్పేసుకున్న నిఖిల్

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 చివరి వారంలో కంటెస్టెంట్స్‌కు ప్రైజ్ మనీని మరింత పెంచుకునే ఛాన్స్ లభిస్తుంది. దానికోసం వారు స్టార్ మా పరివారం సీరియల్ ఆర్టిస్టులతో పోటీపడాల్సి ఉంటుంది. ప్రతీరోజు కనీసం రెండు సీరియల్స్‌కు సంబంధించిన ఆర్టిస్టులు వచ్చి కంటెస్టెంట్స్‌తో పోటీపడి వారి ప్రైజ్ మనీని పెంచి వెళ్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ‘బ్రహ్మముడి’ సీరియల్ ఫేమ్ కావ్య హౌస్‌లోకి ఎంటర్ అయినట్టుగా ప్రోమో విడుదలయ్యింది. తను మాత్రమే కాకుండా ఆకర్ష్, సుహాసిని కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయినట్టు మరో ప్రోమో బయటికొచ్చింది. వాళ్లు వచ్చి కంటెస్టెంట్స్ బ్రేకప్ స్టోరీలు అడిగి తెలుసుకున్నారు.


అవినాష్ ఆవేదన

ప్రస్తుతం హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌లో దాదాపు అందరికీ సుహాసిని, ఆకర్ష్ చాలా క్లోజ్. ముందుగా హౌస్‌లోకి రాగానే అవినాష్ పొట్ట తగ్గిపోయిందని చూసి సుహాసిని షాకయ్యింది. ఆ తర్వాత తనకు మందు కావాలని ఇన్‌డైరెక్ట్‌గా సుహాసినిని అడిగాడు అవినాష్. అది కావాలంటే బయటికి వెళ్లిపోవాల్సిందే అని, తనతో పాటు వచ్చేయమని సుహాసిని బెదిరించింది. దీంతో అవినాష్ వెంటనే మాట మార్చాడు. అది లేకపోతే చచ్చిపోతామా అని టాపిక్ మార్చేశాడు. ఆకర్ష్, సుహాసిని త్వరలోనే విడిపోతున్నామని చెప్తూ తమ మొదటి బ్రేకప్ ఎలా హ్యాండిల్ చేశారో అందరు కంటెస్టెంట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ప్రేరణ దీనికి సమాధానమిచ్చింది.


Also Read: హౌస్ లోకి అడుగుపెట్టిన బ్రహ్మముడి కావ్య.. రచ్చ మామూలుగా లేదుగా..?

బ్రేకప్ స్టోరీస్

‘‘ఎవరైనా మన లైఫ్‌లో ఉండాలి అంటే వారు ఉంటారు. వాళ్లు వెళ్లిపోవాలనుకున్నా అది మన మంచి కోసమే. దానికంటే బెటర్ మన లైఫ్‌లోకి రావచ్చు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది ప్రేరణ. ‘‘బ్రేకప్ తర్వాత చాలా బాధలో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ నాకు చాలా సాయం చేసింది’’ అని గౌతమ్ బయటపెట్టాడు. ‘‘నువ్వు హర్ట్ అవుతావని వదిలేసి వెళ్లిపోవడం కూడా ప్రేమే. అలాంటిది ఈ జెనరేషన్‌లో అంత ఈజీగా దొరుకుతుందని నేను అనుకోవడం లేదు’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు నిఖిల్. ఈ మెసేజ్ పర్సనలా? పబ్లికా? అని అడిగాడు ఆకర్ష్. పర్సనల్‌గా పబ్లిక్ మెసేజ్ అన్నాడు నిఖిల్. ఆ తర్వాత అవినాష్, గౌతమ్, నబీల్ డిఫరెంట్ గెటప్స్‌తో గెస్టులను అలరించారు.

కంటెస్టెంట్స్‌తో పోటీ

‘‘బీబీ పరివారం వర్సెస్ మా పరివారంలో భాగంగా హూలా హూప్స్‌ను పూర్తిగా నిర్మించి, వాటిని విసిరి కనీసం రెండు బాల్స్‌ను మీ వైపుకు లాక్కోవాలి’’ అంటూ గేమ్ గురించి వివరించారు బిగ్ బాస్. ఇందులో ఆకర్ష్, సుహాసినితో పోటీపడడానికి నిఖిల్, నబీల్ రంగంలోకి దిగారు. నబీల్, ఆకర్ష్ ఒంటికాలితో హూలా హూప్స్‌ను సేకరించి తీసుకురాగా నిఖిల్, సుహాసిని వాటిని జతచేశారు. అలా రెండూ పూర్తిగా జతచేసిన తర్వాత బాల్స్‌ను అందుకోవడానికి పోటీపడ్డారు. ఇక ఈ టాస్క్‌లో బీబీ పరివారం విన్ అయితే ప్రైజ్ మనీ మరింత పెరుగుతుంది. మా పరివారం విన్ అయితే ఇప్పటివరకు ఎంత ప్రైజ్ మనీ సంపాదించుకున్నారో అంతటితోనే ఆగిపోతుంది.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×