BigTV English

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Life guards rescued 8 foreigners at Visakha’s Yarada Beach: ఏపీలో విదేశీ పర్యాటకులకు ఘోర ప్రమాదం తప్పింది. విశాఖలోని యూరాడ బీచ్‌కు హాలిడే ట్రిప్పు ఎంజాయ్ చేసేందుకు ఎనిమిది మంది ఇటలీ దేశానికి చెందిన టూరిస్టులు వెళ్లారు. కొంతసేపు అక్కడక్కడ తిరిగిన వారంతా.. సముద్రంలోకి దిగారు. అక్కడే బీచ్‌లో స్వియ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుండగా..ఒక్కసారిగి సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది టూరిస్టులు కొట్టుకుపోయారు.


కొట్టుకుపోతున్న విదేశీయులను చూసి స్థానికులు పెద్దగా అరుపులు, కేకలు పెట్టారు. ఈ అరుపులను గమనించిన జీవీఎంసీ లైఫ్ గార్డులు వెంటనే స్పందించి హుటాహుటిన సముద్రంలోకి దూకారు. కొట్టుకుపోతున్న విదేశీయులను అక్కడి నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన టూరిస్టులను కాపాడిన లైఫ్ గార్డులు వెంకటేశ్, లోవరాజు, శ్రీనివాస్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.

కాగా, విశాఖ పర్యటనకు ఎనిమిది ఇటలీకి చెందిన టూరిస్టులు వచ్చినట్లు తేలింది. వీరంతా గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే విశాఖ టూర్ కోసం వచ్చామని, బీచ్ అందాలను చేసేందుకు వచ్చి స్విమ్మింగ్ చేసేందుకు దిగినటలు చెప్పారు. అందరూ సురక్షితంగా బయటపడడంతో పోలీసులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


Also Read: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

ఇదిలా ఉండగా, సంఘటనా స్థలానికి చేరుకున్న మెరైన్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బీచ్‌లో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని విదేశీ టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంపై విశాఖ కమిషనర్ మాట్లాడారు. విశాఖ బీచ్‌ను జీవీఎంసీ అధికారులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతున్నారన్నారు. విశాఖ బీచ్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేస్తున్నారన్నారు. బీచ్‌లలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రజలు సైతం సహకారం అందించాలని కోరారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×