BigTV English
Advertisement

Another Shock to YSRCP: వైసీపీకి మరో షాక్..? రేపో మాపో టీడీపీ గూటికి మరో వైసీపీకి మరో నేత..?

Another Shock to YSRCP: వైసీపీకి మరో షాక్..? రేపో మాపో టీడీపీ గూటికి మరో వైసీపీకి మరో నేత..?

Visakha YSRCP East Vijayanirmala going to Join TDP: విశాఖ సిటీలో వైసీపీకి ఊహించని షాక్. ఇప్పటికే సిటీలోని చాలామంది నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కొందరు టీడీపీకి, మరికొందరు జనసేన గూటికి వెళ్లిపోయారు. ఇంకా ఆ జాబితాలో చాలామంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్ టీవీకి అందుతున్న సమాచారం మేరకు విశాఖ తూర్పు నియోజకవర్గం మాజీ ఇన్‌ఛార్జ్ అక్కరమాని విజయనిర్మల తెలుగుదేశంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ఇప్పటికే ఆ జిల్లా నేతలతో విజయనిర్మల మాట్లాడారు. పార్టీ హైకమాండ్ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో రేపోమాపో సైకిల్ ఎక్కడం ఖాయమని అంటున్నారు. ఆమె పార్టీ మారడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయట. నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆమెని తప్పించి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఆ బాధ్యతలను అప్పగించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడికి వ్యతిరేకంగా ఆమె ఎన్నో పోరాటాలు చేశారు. అయినా ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించడంపై ఆమె సైలెంట్ అయిపోయారు.

Also Read: స్వామి చుట్టూ రోజా, ‘జబర్దస్త్’ దోపిడీ


రెండోసారి విజయకు వీఎంఆర్డీఏ ఛైర్‌పర్సన్‌గా నియమించినా, ఆ పదవిపై విజయనిర్మల ఆసక్తి చూడలే దు. ముఖ్యంగా పార్టీలో యాదవ వర్గానికి సముచిత స్థానం కల్పించకపోవడంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె అసంతృప్తిని గమనించిన సైకిల్ పార్టీ నేతలు ఆమెతో మంతనాలు సాగించారు. ఈ నేపథ్యంలో టీడీపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావాలని ఆమె భావించారు. అనివార్య కారణాల వల్ల కాలేదు. వీలైతే సోమవారం లేదా మంగళవారం బాబుతో భేటీకానున్నారు విజయనిర్మల. వెంటనే టీడీపీ పార్టీ కండువాను కప్పుకోనున్నారు.

Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×