BigTV English

Visakhapatnam city: విశాఖ ది గ్రేట్ అంటారు ఇందుకేనేమో.. ఎందుకో తప్పక తెలుసుకోండి!

Visakhapatnam city: విశాఖ ది గ్రేట్ అంటారు ఇందుకేనేమో.. ఎందుకో తప్పక తెలుసుకోండి!

Visakhapatnam city: విశాఖపట్నం పేరు వింటేనే గర్వంగా ఉంటుంది. కానీ ఈసారి దేశం మొత్తం కూడా మెచ్చేలా చేసింది ఈ నగరం. ఏమైందో తెలుసా? 2025 సంవత్సరానికి గాను దేశంలోని అత్యంత శుభ్రంగా ఉన్న పట్టణాల జాబితాలో మన విశాఖ నాలుగో స్థానం సంపాదించుకుంది. ఓ సముద్రతీర నగరం, ఓ పారిశ్రామిక నగరం ఇలా దేశంలో టాప్ 5లో స్థానం దక్కించుకుంటే.. అది చిన్న విషయం కాదు. అందుకే విశాఖ ది గ్రేట్ అనేస్తారు అందరూ.


వీధుల్లో చెత్త కనిపించదు. సముద్రతీరాలు నిత్యం శుభ్రంగా మెరిసిపోతుంటాయి. ప్లాస్టిక్ వినియోగం కనీసానికి తగ్గిపోయింది. ఇంటింటికీ తడి చెత్త – పొడి చెత్త వేరు చేసి సేకరిస్తున్నారు. మొన్నటి దాకా వీధికో మూతిపెట్టని చెత్త కుండీలు కనిపించేవి. ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా పని చేసే స్మార్ట్ డస్ట్‌బిన్‌ సిస్టం పని చేస్తోంది. చెత్త ట్రక్కులు ఎక్కడెక్కడికి వెళ్లాలో, ఎంత చెత్త తీసికొచ్చాయో అన్నీ జీపీఎస్‌తో మానిటర్ అవుతున్నాయి. ఇలా పట్టణ పాలకుల దృఢ సంకల్పం, ప్రజల భాగస్వామ్యం కలగలిసి విశాఖను పరిశుభ్రతకు నిదర్శనంగా మార్చేశాయి.

ప్రజలు కూడా ఇందులో పోషించిన పాత్ర గమనించదగ్గది. స్కూల్ పిల్లలు, కాలేజ్ యువత, స్వచ్ఛతకు కట్టుబడిన వాలంటీర్లు.. వీళ్లంతా కలసి ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నేనే మారాలన్న సందేశంతో ప్రతి ఒక్కరు స్వయంగా శుభ్రతకై ముందుకొచ్చారు. బీచ్‌ల దగ్గర నుంచి మార్కెట్ల వరకూ.. విశాఖ అంతా అలా కొత్త రూపం దాల్చింది. పైగా, ఇది కేవలం మున్సిపాలిటీ చేసే పని అనిపించకుండా అందరిదీ బాధ్యత అన్న భావన నెలకొంది.


అయితే ఇండోర్ ఎప్పటిలాగానే మొదటి స్థానం దక్కించుకుంది. సూరత్ రెండో స్థానంలో ఉంది. నవీ ముంబయి మూడో స్థానంలో నిలిచింది. మన తెలుగునాట విజయవాడ కూడా 5వ స్థానంలో నిలవడం గర్వకారణమే. భోపాల్, తిరుపతి, మైసూరు, ఢిల్లీ, అంబికాపూర్ కూడా ఈ జాబితాలో నిలిచాయి. కానీ… విశాఖపట్నం టాప్ 5లో నిలవడమే అసలు హైలైట్. పరిశుభ్రత పరంగా దేశానికి మార్గనిర్దేశకంగా నిలుస్తూ, విశాఖ ది గ్రేట్ అనిపించుకుంటోంది.

Also Read: Free Gas Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సిలిండర్ బుక్ చేస్తే.. డబ్బు ముందే బ్యాంకులో!

విశాఖలో దూకుడు పెంచిన అభివృద్ధి
శుభ్రత పరంగా దేశాన్ని మెప్పించిన విశాఖ.. ఇప్పుడు అభివృద్ధి పనులలో కూడా అదే ఉత్సాహంతో ముందడుగు వేస్తోంది. కొత్తగా అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. దీంతో విదేశీ పర్యాటకుల రాక పెరిగే అవకాశముండటం విశేషం. మరోవైపు విజాగ్ మెట్రో రైలుకి కేంద్రం అనుమతి ఇచ్చింది. త్వరలోనే మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి.

గ్రీన్ టెక్ పార్క్, బీచ్ రోడ్ బ్యూటిఫికేషన్, ఎలక్ట్రిక్ బస్సులు, స్మార్ట్ సిగ్నల్స్, పబ్లిక్ బైసికల్ షేరింగ్ సిస్టం వంటి ఆధునిక ప్రాజెక్టులు ఇప్పటికే అమలవుతున్నాయి. రుషికొండ నుంచి భీమిలి వరకూ నూతన బీచ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కూడా పర్యాటక రంగానికి కొత్త ఊపు నిస్తోంది.

అంతేకాదు, విశాఖను డిఫెన్స్, ఐటీ, టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ప్రణాళికలు రూపొందించాయి. ఈ మార్పులు విశాఖను భవిష్యత్తులో దేశంలోనే మోడల్ సిటీగా నిలబెడతాయన్న నమ్మకం ఎంతో మందిలో ఉంది. అందుకే.. ఈసారి విశాఖ క్రెడిట్ అసలే కొట్టేసింది. అభివృద్ధిలోనూ, పరిశుభ్రతలోనూ.. డబుల్ ధమాకా క్రెడిట్ కొట్టేసిన నగరంగా విశాఖ ముందుంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×