The Girl Friend: రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend). ఈ సినిమా త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ విడుదల చేశారు. “నదివే “(Nadhive)అంటూ సాగిపోయే ఈ పాటలో రష్మిక దీక్షిత్ శెట్టి(Deekshi Shetty) పర్ఫామెన్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నటుడు దీక్షిత్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
నదివే సాంగ్…
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈయన అభిమానులతో పంచుకున్నారు . అదేవిధంగా నదివే పాట షూటింగ్లో భాగంగా చిన్న ప్రమాదం(Accident) కారణంగా తాను, రష్మిక స్వల్ప గాయాలు పాలైనట్టు ఈ సందర్భంగా దీక్షిత్ శెట్టి బయటపెట్టారు. ఈ సందర్భంగా దీక్షిత్ మాట్లాడుతూ తాను సినిమా కోసం డాన్స్ చేయడం ఇదే మొదటి సారి అని తెలిపారు. మన శరీరాన్ని నియంత్రణలో పెట్టుకుంటూ మ్యూజిక్ అనుగుణంగా పెర్ఫార్మెన్స్ చేయాలంటే కాస్త కష్టమని ఈయన తెలిపారు.లైవ్ షోలో చిన్నచిన్న పొరపాట్లు జరిగిన పెద్దగా పట్టించుకోరు కానీ సినిమా విషయంలో ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని తెలిపారు.
స్వల్ప గాయాలు…
ఈ సాంగ్ షూటింగ్ సమయంలో డాన్స్ పర్ఫెక్ట్ గా రావడం కోసం పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేశామని అయితే ప్రాక్టీస్ చేసే సమయంలో స్వల్ప గాయాలు పాలయ్యామని వెల్లడించారు. రష్మికకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయని తెలియజేశారు. అయితే ఈ గాయాలు కూడా కొత్తది నేర్చుకోవడానికి మంచి అవకాశమని ఈయన తెలియజేశారు. ఈ పాట కోసం మేం పడిన కష్టానికి ప్రస్తుతం మంచి ప్రతిఫలం లభించిందని దీక్షిత్ శెట్టి వెల్లడించారు. ఇలా ఈ పాట షూటింగ్ కోసం గాయాలు పాలయ్యామనే విషయం తెలియడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.
పాన్ ఇండియా మూవీలతో బిజీ…
ఇక రష్మిక ఇటీవల కాలంలో వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారు. యానిమల్ సినిమా నుంచి మొదలుకొని పుష్ప2, ఛావా, కుబేర సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు రష్మిక మైసా(Mysaa) అనే సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా మరోసారి అల్లు అర్జున్ తో కలిసి అట్లీ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలో కూడా రష్మిక నటించబోతున్నారు అయితే ఈ సినిమాలో రష్మిక విలన్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇలా మొదటిసారి రష్మిక నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారని తెలిసి అభిమానులు కూడా ఎంతో ఆత్రుత కనబరుసన్నారు.
Also Read: Mrunal thakur: రోడ్డు పై ఆ పని చేస్తూ దర్శనమిచ్చిన మృణాల్.. సింప్లిసిటీకి ఫిదా?