BigTV English

Prabhas-jr NTR: విగ్గు లేకుండ ప్రభాస్.. ముడతల ముఖంతో ఎన్టీఆర్, స్టార్ హీరోల ఫ్యాన్ వార్.. అసలేం జరుగుతోంది?

Prabhas-jr NTR: విగ్గు లేకుండ ప్రభాస్.. ముడతల ముఖంతో ఎన్టీఆర్, స్టార్ హీరోల ఫ్యాన్ వార్.. అసలేం జరుగుతోంది?

Prabhas Fans Vs Jr NTR Fans: ఇండస్ట్రీలో హీరోలంతా మంచి సన్నిహితంగా మెదులుతుంటారు. ఒకరిపై ఒకరు అభిమానుం చాటుతూ.. పండగలు, వేడుకలు విష్ చేసుకుంటూ మంచి స్నేహ భావంతో మెదుతులంటారు.ఒక్కొసారి వారి అనుబంధం చూసి నెటిజన్స్ మురిసిపోతుంటారు. కానీ, ఫ్యాన్స్ మాత్రం ఏదోక విషయంలో తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ వార్ కు దిగుతారు. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఇది మరింత ముదిరింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలో మల్టీస్టారర్ గా రూపొందిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.


ఆర్ఆర్ఆరో వార్ మొదలు

ఇందులో ఇద్దరు హీరోలు సమానమైన స్క్రీన్ షేర్ ఉంది. కానీ, వారి హీరోలు మాత్రం మా హీరోది లీడ్ రోల్ అంటే మా హీరోది లీడ్ రోల్ అంటూ ట్విటర్ వార్ కు దిగారు. ఆ వార్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా అయా హీరో ఫ్యాన్స్ తమ హీరోలను టార్గెట్ చేస్తూ.. కాంట్రవర్సల్ పోస్ట్ పెడుతుంటారు. మా హీరోనే అంటావా అంటూ మరో హీరో ఫ్యాన్స్ వారి హీరోను టార్గెట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్ సెగ ప్రభాస్ కు తగిలింది. ప్రభాస్ బట్టతలతో ఉన్న ఫోటోను ట్విటర్ లో వైరల్ చేస్తున్నారు. ఇండియన్ మూవీలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ప్రభాస్ ముందుంటారనడంలో సందేహం లేదు.


ప్రభాస్ బాల్డ్ హెడ్ లుక్

ఆరడగులు ఆజానుబాహుడు. బాహుబలిలాంటి బాడీతో అమ్మాయిల కలల రాకముడిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. నాలుగు పదుల వయసులోనూ ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు. డార్లింగ్ ను చూసినప్పుడు అబ్బా.. ఏముండ్రా బాబూ అంటూ అమ్మాయిలంత మనసు పారేసుకుంటారు. అలాంటి మోస్ట్ హ్యాండ్సమ్ ను ట్రోల్ చేస్తూ ఓ వర్గం ఫ్యాన్స్ ఆయన బాల్డ్ హెడ్ లుక్ ని వైరల్ చేస్తున్నారు. విగ్గు లేకుండ ప్రభాస్ అంటూ ఆయన ఫోటోను సోషల్ మీడియా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ రింకిల్ లుక్

అయితే ఇప్పుడు అంత ప్రభాస్ పై ఎందుకు పడ్డారా? అని ఆరా తీస్తే.. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పని అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ బట్టతలతో ఉన్న ఫోటోని షేర్ చేసినట్టు వెల్లడైంది. దీంతో మేమైన తక్కువ తిన్నామా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తారక్ షాకింగ్ లుక్ షేర్ చేశారు. ముఖమంత ముడతలతో ముసలితనంతో ఉన్న ఎన్టీఆర్ లుక్ ని వదిలారు. దీంతో ఇప్పుడు ట్విట్టర్ ఇద్దరి హీరో మధ్య ఫ్యాన్ వార్ కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటూ ట్విట్ వార్ కు దిగారు. తమ హీరోలకు సంబంధించిన వియర్డ్ లుక్స్ షేర్ చేయడం మరో వర్గం ఫ్యాన్స్ ఆగ్రానికి లోనవుతున్నారు. ఇప్పుడు ట్విట్టర్ మొత్తం.. ప్రభాస్ ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీర్ ఫ్యాన్స్ యుద్దం సాగుతుంది. మరి ఈ వార్ ఎక్కడికి దారి తీస్తోంది చూడాలి.

Also Read: Hari Hara Veera Mallu: అసురహననం.. పవన్ ఫైర్ కి స్క్రీన్ తగలబడిపోద్ది.. వీరమల్లుపై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్

Related News

Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?

Dulquar Salman : గత జన్మలో కళ్యాణి నేను కవలపిల్లలం

Venky Atluri: స్టేజ్ పైనే నాగ వంశీ పరువు తీసేసిన దర్శకుడు వెంకీ అట్లూరి

Kishkindhapuri : హర్రర్ సినిమా అన్నారు, ఎక్కడ భయపడాలో కూడా చెప్పండి

Bollywood: 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు ప్రకటించిన బాలీవుడ్ నటి!

Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే

Big Stories

×