E-Paper
Advertisement

స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువతీయువకులు!

స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువతీయువకులు!
Advertisement

Visakhapatnam: స్నేహితుల దినోత్సవం రోజున ఆనందంగా గడపాలని భావించిన ఆ స్నేహితుల గుంపులో ఊహించని విషాదం నిండింది. సరదాగా గడపడానికి బీచ్‌కి వెళ్లిన ఐదుగురు మిత్రుల్లో ఇద్దరు సముద్ర అలల తాకిడికి గల్లంతయ్యారు.

తీరంలో విషాద ఛాయలు

Advertisement

విశాఖపట్నం పెద జాలారిపేటకు చెందిన ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు ఆదివారం పెదగంట్యాడ మండలం పరిధిలోని పాత గంగవరం బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ వారంతా కలిసి ఫోటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీతూ అనే యువతి అలల ఉద్ధృతికి సముద్రంలో పడిపోయింది. నీతూను కాపాడేందుకు రాము అనే యువకుడు వెంటనే నీటిలోకి దిగాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.

Also Read: ఏపీ పొగాకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ .. కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి!

Advertisement

రంగంలోకి దిగిన పోలీసులు

తోటి మిత్రులు కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన నీతూ, రాము కోసం గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసు సిబ్బంది తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పండుగ రోజున ఈ ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాల్లో శోకసంద్రం నెలకొంది.

Tags

Related News

బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!

క్రెడిట్ కొట్టేస్తున్న చంద్రబాబు.. ఎస్వీ మ్యూజియం అసలు నిజాలివే! – భూమన కరుణాకర్ రెడ్డి

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×