E-Paper
Advertisement

KK Raju: విశాఖలో రూ. 5 వేల కోట్ల భూ దోపిడీ.. కూటమి నేతలపై విరుచుకుపడ్డ కేకే రాజు!

KK Raju: విశాఖలో రూ. 5 వేల కోట్ల భూ దోపిడీ.. కూటమి నేతలపై విరుచుకుపడ్డ కేకే రాజు!
Advertisement

KK Raju: విశాఖపట్నం నగరంలో సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా.. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని కేకే రాజు తీవ్రంగా విమర్శించారు. ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఎంపీ భరత్ స్వయంగా భూకబ్జాలకు పాల్పడటం అత్యంత విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ.. వేగంగా అక్రమ కట్టడాలు నిర్మించడం చట్టాన్ని ధిక్కరించడమేనని మండిపడ్డారు.

గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో జీవీఎంసీ సమావేశంలో అక్రమ మార్గాల్లో క్రమబద్ధీకరణలు చేశారని.. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి భారీ భూ దోపిడీ ఏనాడూ జరగలేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన బోర్డులను తొలగించి మరీ ఆక్రమణలు చేస్తున్నా.. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి రామని తెలిసి ముందే దోచుకోవాలనే ధోరణితో కూటమి నేతలు ఉన్నారని విమర్శించారు.

Advertisement

అధికారుల తీరుపై కూడా కేకే రాజు నిప్పులు చెరిగారు. జీవీఎంసీ కమిషనర్‌కు ఐఏఎస్ ఉండాల్సిన కనీస లక్షణాలు లేవని, అధికారులు రాజకీయ నాయకులకు బానిసల్లా వ్యవహరించడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ భూకబ్జాలపై ప్రైవేట్ కేసులు వేస్తున్నామని, ఇందులో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, ఆర్డీఓలను కూడా బాధ్యులుగా చేరుస్తున్నట్లు తెలిపారు. ఊరు పేరు లేని కంపెనీలకు వేల కోట్ల భూములను కేవలం 99 పైసలకే కట్టబెడుతున్నారని.. ఈ కుంభకోణం నుంచి విశాఖను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.

Also Read:జీవన్ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఉన్న ఆ సంచలన విషయాలేంటి?

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×