Jeevan Reddy: జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న ఆయన, ప్రస్తుత రాజకీయ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు, ముఖ్యంగా గత 20 నెలలుగా కొనసాగుతున్న పరిణామాలు భరించలేని స్థాయికి చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ.. ఏఐసీసీ సభ్యత్వానికి , పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈ నెల 25వ తేదీన రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
జీవన్ రెడ్డి తన అసంతృప్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి వల్ల తన గౌరవానికి భంగం కలిగిందని, తన సమస్యలకు ముఖ్యమంత్రి దగ్గర కూడా పరిష్కారం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలు, పాత నేతలకు ప్రాధాన్యత తగ్గడం వంటి అంశాలు ఆయనను తీవ్రంగా కలచివేసినట్లు తెలుస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వంటి నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన తన నిర్ణయానికే మొగ్గు చూపారు.
రైతాంగ సమస్యలపై కూడా ఆయన గళమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు, సాగునీటి కష్టాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు ఈ నెల 25న జగిత్యాలలోని బండారు గార్డెన్స్‌లో ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించనున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ ఆయన తీసుకోబోయే ఈ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద చర్చకు దారితీసింది.
Also Read:పంజాగుట్టలో విషాదం.. శ్రీవాత్స అపార్ట్‌మెంట్ బాల్కనీ కూలి ఇద్దరు మృతి
రాజీనామా చేయడమే నాకున్న ఏకైక మార్గం.. నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు కొనసాగడంలో అర్థం లేదు
– కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
My only option is to resign. There is no point in continuing when there is no solution to my problem
– Congress leader and former… https://t.co/oNiMZymmai pic.twitter.com/6ATe1JTzeI
— BIG TV Breaking News (@bigtvtelugu) March 22, 2026