E-Paper
Advertisement

Student Suicide: తీవ్ర విషాదం.. స్కూల్ ID కార్డ్ ట్యాగ్‌తో ఉరి వేసుకుని 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!

Student Suicide: తీవ్ర విషాదం.. స్కూల్ ID కార్డ్ ట్యాగ్‌తో ఉరి వేసుకుని 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
Advertisement

Student Incident: హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి తన ఇంటిలోని బాత్రూంలో స్కూల్ ఐడీ కార్డుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోజు మాదిరిగానే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ప్రశాంత్, డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.

అయితే ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా, బట్టలు ఆరేసుకోవడానికి కట్టిన వైర్‌కు ఐడీ కార్డ్‌తో ఉరేసుకుని కనిపించాడు. తల్లిదండ్రులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, చికిత్స అందించేలోపే ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయాడు.. ఆత్మహత్య చేసుకోవడంతో ప్రశాంత్ డెడ్‌బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

ఈ ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. రోజు చురుకుగా ఉండేవాడు నా కొడుకు.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీని గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చందానగర్ పోలీసులు ఈ ఘటనను అనుమానాస్పద మృతి (Suspected Death)గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: తెలంగాణ పల్లెపోరులో చివరి అంకం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

Advertisement

అసలు బాలుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల ఏంటి అని పోలీసులు అతని స్నేహితులు, స్కూల్ సిబ్బంది, తల్లిదండ్రులను విచారిస్తున్నారు. అంత చిన్న వయసులో విద్యార్థి ఉరేసుకోవడం వెనుక ఏదైనా వేధింపులు, ఒత్తిడి లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీని పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×