BigTV English

Vivekananda Case: అవినాష్‌రెడ్డి మెడకు ఉచ్చు.. మళ్లీ రంగంలోకి సీబీఐ?

Vivekananda Case: అవినాష్‌రెడ్డి మెడకు ఉచ్చు.. మళ్లీ రంగంలోకి సీబీఐ?

Vivekananda Case: వివేకానంద కేసు కొత్త మలుపు తిరుగుతోందా? ఈ కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వస్తుందా? అవినాష్‌రెడ్డికి కష్టాలు పొంచి ఉన్నాయా? సుప్రీంకోర్టు తీర్పుతో సునీత మళ్లీ పిటిషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధమైంది. కింది కోర్టు టైమ్ బాండ్ విధించి ఈసారి విచారణకు ఆదేశిస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సునీత రెండు వారాల్లో పూర్తి వివరాలతో సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆమె పిటిషన్ దాఖలు చేసిన 8 వారాల్లోపు ట్రయల్‌ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.

సునీత ప్రస్తావించబోయే అంశాలు బట్టి మళ్లీ సీబీఐ దర్యాప్తు కొనసాగించాలా? లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశిస్తే అవినాష్‌రెడ్డి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈసారి అరెస్టు నుంచి ఆయన్ని ఎవరూ కాపాడలేరని అంటున్నారు. సునీత బాధిత కుటుంబం కావడంతో ఆమెకు అనుకూలంగా తీర్పు రావచ్చని సునీత మద్దతుదారుల మాట.


వివేకానంద కేసులో మళ్లీ సీబీఐ దర్యాప్తు అవసరమా? లేదా అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. మంగళవారం సుప్రీంకోర్టులో సీబీఐ వివరణ ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశిస్తే విచారణ చేసేందుకు తాము సిద్ధమేనని తెలిపింది. సునీత పిటిషన్‌పై మెరిట్స్ ఆధారంగా విచారించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది న్యాయస్థానం. ఈ క్రమంలో సునీత తరపు న్యాయవాది సిద్ధార్ధలుథ్రా తన వాదనలు వినిపించారు.

ALSO READ: ఏపీలో సందడే సందడి.. ఇళ్లు కట్టుకునేవారికి ఇక పండగే

ఘటనకు సంబంధించిన వివరాలు న్యాయస్థానానికి అందజేశారు. నిందితులకు బెయిల్ రద్దుతోపాటు మళ్లీ దర్యాప్తు కోరుతున్నట్లు అడ్వకేట్ వివరించారు. ఈ క్రమంలో సునీత లాయర్‌కు న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు. మీ అప్లికేషన్‌పై నిర్ణయం తీసుకునే వరకు ముందుకు సాగదన్నారు. ట్రయల్ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుందని వ్యాఖ్యానించారు.

ఈ కేసు విచారణ ఆరునెలల్లో ముగిస్తే తాము ఏదో ఒకటి ఆలోచిస్తామన్నారు. చివరకు ఈ కేసు దర్యాప్తు సాగాలా? వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం మళ్లీ సీబీఐ కోర్టుకి అప్పగించింది. పిటిషన్ వేయడానికి రెండువారాలు, దానిపై నిర్ణయం చెప్పడానికి న్యాయస్థానానికి ఎనిమిది వారాలు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. దీని తర్వాత అవినాష్ రెడ్డితోపాటు పలువురు నిందితుల బెయిల్ రద్దు  పిటిషన్లపై అప్పుడు విచారణ చేస్తామని పేర్కొంది.

Related News

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. తెరపైకి కొత్త పేర్లు, నేతల గుండెల్లో గుబులు

AP Govt: ఏపీలో సందడే సందడి.. ఇల్లు కట్టుకునేవారికి పండగే, ఇంకెందుకు ఆలస్యం

Aarogyasri Services: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలి.. సీఈవో విజ్ఞప్తి

Srisailam Karthika Masam: శ్రీశైలంలో అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసోత్సవాల.. ఆ రోజే కోటి దీపోత్సవం.!

Medical Colleges: ఇది మామూలు పోలిక కాదు.. ఉతికి ఆరేశారంతే

Bhumana – TTD: దొరికిపోయిన భూమన.. అలిపిరి ఆరోపణపై టీటీడీ రియాక్షన్ ఇదే!

Tirumala: తిరుమలలో ఘోర అపచారం.. అలిపిరి మార్గంలో నిర్లక్ష్యం

Big Stories

×