Strange Thief: విజయనగరం జిల్లా బొబ్బిలిలో.. ఒక విచిత్రమైన దొంగతన ఘటన చోటుచేసుకుంది. దొంగతనానికి వెళ్లిన ఓ వ్యక్తి మద్యం మత్తులో.. తన పని మరిచి ఇంట్లోనే నిద్రపోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటన ఎలా జరిగింది?
బొబ్బిలి పట్టణానికి చెందిన సీర శ్రీనివాసరావు అనే వ్యక్తి.. వ్యవసాయ పనుల నిమిత్తం.. మూడు రోజుల క్రితం తన ఊరు వదిలి.. విజయనగరం జిల్లా అలజంగి అనే గ్రామానికి వెళ్లాడు. ఇది గమనించిన దొంగ ఇంటి తాళం పగులకొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. మూడు రోజుల నుంచి ఇంట్లోని వెండి, ఇత్తడి సామాన్లన్ని అమ్మకుంటూ మద్యం తాగుతూ ఇంట్లోనే నిద్రపోతున్నాడు.
దొంగ ఇంటిలోనే మత్తులో మునిగి
దొంగ తన పని ముగించాక బయటకు వెళ్లకుండా.. మళ్లీ అదే ఇంట్లోకి వచ్చి మద్యం తాగాడు. మూడు రోజుల పాటు అతను అదే ఇంట్లో ఉన్నట్లు సమాచారం. చివరికి మద్యం మత్తులో మునిగి పడుకున్న వ్యక్తిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంటి యజమాని కనిపించకపోవడం, ఇంటి తలుపు తీయకపోవడం అనుమానం కలిగించడంతో స్థానికులు దగ్గరకి వెళ్లి చూస్తే, మత్తులో ఉన్న వ్యక్తి కనిపించాడు.
పోలీసులకు సమాచారం
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నిద్రపోతున్న దొంగను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కొన్ని చోరీ చేసిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
విచారణ కొనసాగుతోంది
పోలీసులు ప్రస్తుతం అతని నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు విచారణ చేపట్టారు. ఇతనికి మరోచోట్ల కూడా ఇలాంటి కేసులు ఉన్నాయా? ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనానికి వెళ్లిన వ్యక్తి ఇంట్లోనే మత్తులో పడుకుని ఉండడం.. ఎంతలా నిర్లక్ష్యంగా ఉందో చెప్పుకుంటున్నారు.
Also Read: మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్..13 మంది విద్యార్థులపై వేటు, వారిలో..
ఇది కేవలం చోరీ మాత్రమే కాదు, మద్యం మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో ఓ ఉదాహరణ. నేరానికి పాల్పడిన వ్యక్తి బాధ్యత లేకుండా.. మద్యం మత్తులో ఇంట్లోనే తాగి పడుకోవడం.. చట్టాన్ని అవమానించినట్లే.. పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేసి, బాధితుడికి న్యాయం చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వింత దొంగ.. చోరీ చేసిన ఇంట్లోనే నిద్రపోయి….!
విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఘటన
మద్యం మత్తులో చోరీ చేసిన ఇంట్లోనే నిద్రపోతున్న దొంగ
వ్యవసాయ పనుల నిమిత్తం సొంతూరు అలజంగికి వెళ్లిన సీర శ్రీనివాసరావు అనే వ్యక్తి
ఎవరూ లేరని గమనించి.. శ్రీనివాసరావు ఇంటి తాళం పగులగొట్టి చొరబడిన… pic.twitter.com/GjtfCgzPcf
— BIG TV Breaking News (@bigtvtelugu) July 2, 2025