AIIMS Mangalagiri Ragging: ఐఐటీ, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ర్యాగింగ్ భూతం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. మొత్తం 13 మంది సీనియర్ వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసింది. అందులో ఎయిమ్స్ డీన్ కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్ భూతం పురి విప్పింది. కొందరు సీనియర్ వైద్య విద్యార్థులు.. జూనియర్ విద్యార్థిని తీవ్రంగా వేధించారు. మనస్థాపం గురైన బాధిత విద్యార్థి ఒకానొక దశల బల వన్మరణానికి ప్రయత్నించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతికి చెందిన ఓ విద్యార్థి గతేడాది గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌లో జాయిన్ అయ్యాడు. ఎయిమ్స్‌లో సదరు విద్యార్థికి- సీనియర్లకు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. తమ గురించి వైద్య విద్యార్థినుల వద్ద సదరు జూనియర్ విద్యార్థి తప్పుగా మాట్లాడినట్టు సీనియర్లు భావించారు.. ఆ తర్వాత అనుమానించారు. జూనియర్‌కి గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యారు.
జూన్ 23 నుంచి రెండురోజులపాటు హాస్టల్‌లో నిర్బంధించి కొట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. మనస్తాపం గురైన జూనియర్ విద్యార్థి చేయి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలో యూజీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది.
ALSO READ: ఏపీలో వారికి పండగే.. అకౌంట్లలోకి డబ్బులు జమ
వెంటనే స్పందించిన యూజీసీ అధికారులు.. మంగళగిరి ఎయిమ్స్ అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ ఉన్నతాధికారుల బృందం ర్యాగింగ్‌పై విచారణ జరిపింది. దీనికి బాధ్యులైన 13 మంది సీనియర్ విద్యార్థులను గుర్తించి సస్పెండ్ చేశారు. అందులో మంగళగిరి ఎయిమ్స్ డీన్ కుమారుడు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఘటనలో మరో ఐదుగురి ఉన్నట్టు తెలుస్తోంది. రేపో మాపో ఆ విద్యార్థులపై చర్యలకు సిద్దమైంది ఎయిమ్స్ యాజమాన్యం. ముగ్గురు విద్యార్థులకు ఏడాదిన్నర, నలుగురు విద్యార్థులకు ఏడాది ఆరుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. ర్యాగింగ్‌లో పాల్గొనలేదని తేలడంతో ఇద్దరు విద్యార్థులు బయటపడ్డారు.
ఇటీవల ర్యాగింగ్ నిరోధక నిబంధనలను పాటించడంలో విఫలమైన ఐఐటీలు, ఐఐఎంలు సహా 89 ఉన్నత విద్యా సంస్థలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-యుజిసి గుర్తించింది. వాటిని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. UGC యాంటీ-ర్యాగింగ్ నిబంధనలు-2009 ప్రకారం.. తప్పనిసరి ఆయా కాలేజీలు పత్రాలు సమర్పించలేదు. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే గ్రాంట్లను ఉపసంహరణ, పరిశోధన నిధులను నిలిపివేయడం జరుగుతుందని హెచ్చరించింది UGC.