Ys jagan imitate Chandrababu target welfare scemes: పదవిలో ఉన్నా లేకున్నా రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలి. అప్పుడూ మేమింతే ఇప్పుడూ మేమింతే అంటే కుదరదు. మామూలుగానే వెటకారం పాళ్లు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎక్కువే. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను దారుణంగా ఆరేసుకున్నారు. చంద్రబాబును అయితే అసెంబ్లీలో ఏడిపించారు కూడా. తమ పార్టీ నేతలు చంద్రబాబు వయసును కూడా లెక్కచేయకుండా చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ పోయారు. ఒక్కో సందర్భంలో తానే ఏకవచన ప్రయోగాలు, తిట్లు, శాపనార్థాలతో విసిగెత్తించారు. పవన్ కళ్యాణ్ ను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన కు ముగ్గురు భార్యలంటూ అనేక సందర్భాలలో పవన్ ని టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఒక్కో సందర్భంలో శృతి మించి కూడా మాట్లాడుతుంటారు. ఇటీవల ఏపీలో వచ్చిన వరదల విషయంలోనూ రాజకీయాలు చేస్తునే ఉన్నారు. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ అభాండాలు వేశారు.
చంద్రబాబును ఇమిటేట్
రీసెంట్ గా చంద్రబాబును టార్గెట్ చేసి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారు. అక్కడి దాకా బాగానే ఉంది. చంద్రబాబును ఇమిటేట్ చేస్తూ జగన్ చేసిన ఓవర్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటించారు. పబ్లిక్ చూస్తుండగా రెచ్చిపోయారు. అచ్చంగా చంద్రబాబను ఇమిటేట్ చేస్తూ హామీలు ఇచ్చేటప్పుడు అలా అన్నారు..తీరా విషయం అడిగితే ఇలా అంటున్నారంరంటూ మండిపడ్డారు. అసలు చంద్రబాబుకు హామీలు నెరవేర్చే సత్తా ఉందా అని అడిగారు. చూస్తుండగానే నాలుగు నెలలు పూర్తయ్యాయి. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలకు రెట్టింపు స్థాయిలో ఇస్తామని చెప్పి తీరా అసలే ఇవ్వకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఏ హామీలు అయితే ఇచ్చి అధికారాన్ని దక్కించుకున్నారో ఇప్పుడు అవే హామీలపై జగన్ నిలదీస్తున్నారు. హామీలు నెరవేర్చే ప్రక్రియలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా, ఫీజు రీఅంబర్స్ మెంట్, అమ్మ ఒడి లాంటి పథకాలను చంద్రబాబు నీరుగారుస్తున్నారంటూ మండిపడ్డారు.
మొక్కుబడి నిధులు
మళ్లీ మేము వస్తేనే ఈ పథకాలకు మోక్షం అని..ఈ ప్రభుత్వం వలన ఏమీ కాదని..పీకల్లోతు అప్పుల్లో ఉంటే సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తుందని అన్నారు. ఎవరి అండ చూసుకుని హామీలు ఇచ్చారో ఇప్పుడు వారే బాబు ప్రభుత్వానికి నిధులు ఇచ్చేందుకు వెనకాడుతున్నారని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ నిధులను మొక్కుబడిగా విదిల్చినా తీసుకున్నారే తప్ప ఏపీ రాజధాని, పోలవరం విషయాలను పక్కన పెట్టేశారని జగన్ అన్నారు. చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయం వైసీపీకి కలిసొచ్చేలా ఉంది. దీని ప్రకారం మరో సారి ఎన్నికలు వస్తే ప్రజల మద్దతు తమకే ఉంటుందనే నమ్మకం పెరిగిందని వైఎస్ జగన్ అంటున్నారు. ప్రతినెలా ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని అన్నారు.
అహంకారపు మాటలు
అన్న క్యాంటీన్ల భారం అంతా ప్రజలపైనే వేశారని..ఇందులో వారి గొప్పతనం ఏముందని ప్రశ్నించారు. అయితే జగన్ వ్యంగ్య వ్యాఖ్యానాలతో పాటు సీఎం చంద్రబాబును ఇమిటేట్ చేస్తూ తెగ రెచ్చిపోయారు. పబ్లిక్ లో తన గొప్పతనాన్ని ప్రదర్శించారు. దీనిపై సోషల్ మీడియాలో జగన్ కు వ్యతిరేకత ఎక్కువయింది. వచ్చిన నాలుగు నెలలలోనే ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారు? మీకు ఐదేళ్లు సమయం ఇచ్చినా రాజధాని కట్టలేకపోయారు. పోలవరం నిర్మించుకోలేకపోయారు అంటూ చురకలు అంటించారు. ఇకనైనా జగన్ తన వెటకారపు చేష్టలు, మాటలు మానుకోవాలి. ప్రతిపక్షనేతగా హుందాగా వ్యవహరించాలి అంటున్నారు జనం. అధికారంలో లేకపోయినా అహంకారపు మాటలు మాత్రం పోలేదని జగన్ ని ట్రోల్ చేస్తున్నారు.