E-Paper
Advertisement

Pawan Kalyan : పంచాయతీ రాజ్ శాఖపై శ్వేతపత్రం.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప్రకటన

Pawan Kalyan : పంచాయతీ రాజ్ శాఖపై శ్వేతపత్రం.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప్రకటన
Advertisement

Deputy CM Pawan Kalyan Panchayt Department : గత ప్రభుత్వ పాలనలో పంచాయతీ రాజ్ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో పవన్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి వచ్చిన రూ.2000 కోట్ల నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎవరి అనుతి తీసుకోకుండానే నిధులను పక్కదారి పట్టించినట్లుగా గుర్తించామని తెలిపారు.

త్వరలోనే పంచాయతీరాజ్ శాఖలో జరిగిన కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి అవకతవకలు వారసత్వంగా వచ్చాయన్నారు. వీటిపై నాలుగైదు గంటలపాటు స్పెషల్ గా చర్చ జరగాలన్నారు. పంచాయతీరాజ్ శాఖలో జరిగిన కుంభకోణంలో లోతైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Advertisement

Also Read: ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం.. రాష్ట్ర విభజనతో నష్టపోయాం: సీఎం చంద్రబాబు

2019-24 వరకూ 15వ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించి 5,251 కోట్ల రూపాయలు, 14వ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించి రూ.2,336 కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లలో పడ్డాయని తెలిపారు. కానీ వీటిలో రూ.2,285 కోట్లు ఆర్థికశాఖ కరెంట్ ఛార్జీల కింద ఏపీ డిస్కమ్ కు పంపించిందని, ఇందుకు ఎవరి అనుమతి తీసుకోలేదని తెలిపారు. ఇక నేటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.

Related News

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

Big Stories

Advertisement
×