BigTV English

Pawan Kalyan:పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇక పండుగే..డబుల్ బొనాంజా

Pawan Kalyan:పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇక పండుగే..డబుల్ బొనాంజా

Pawan Kalyan to be deside complete two up coming movies
మెగా తమ్ముడిగా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనలో నిజంగానే పవర్ ఉంది. అదే ఆకర్షణ పవర్ తో సినీ రంగాన్ని ఏలారు. తర్వాత రాజకీయాలలోనూ రాణించి పవర్ ఫుల్ మంత్రి పదవిని చేపట్టారు. పదేళ్లుగా ఎటువంటి పదవి ఆశించకుండా ప్రజా సేవలో ఉన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్య ఎక్కడ వచ్చినా అక్కడికి తాను స్వయంగా వెళ్లి అవసరమైతే తన డబ్బులు ఖర్చుపెట్టే పవన్ ఆర్థికంగా నష్టపోతున్నా తనని నమ్మి వచ్చినవారికి న్యాయం చేస్తూ..చేతనయినంత సాయం అందిస్తూ ఇప్పటికీ అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.


పాలిటిక్స్ లో బిజీ..

సంవత్సర కాలంగా పవన్ ఏపీ రాజకీయాలలో బిజీగా ఉండటంతో ఆయన కమిట్ అయిన సినిమాలు ఆగిపోయే పరిస్థితికి వచ్చాయి. చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. పవన్ ని నమ్ముకుంటే అంతే మరి..ఇక ఆ నిర్మాతలకు దేవుడే దిక్కు అని నెగెటివ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఓకే అంటే బ్లాంక్ చెక్కులతో నిర్మాతలు రెడీగా ఉన్నారు సినిమాలు తీసేందుకు. అయితే కమర్షియల్ గా ఆలోచించని పవన్ కళ్యాణ్ ఇక ముందు సినిమాలు ఆచితూచి ఒప్పుకుందామని అనుకుంటున్నట్లు సమాచారం. కొత్త గా మరేవీ ప్రాజెక్టులు ఒప్పుకోకుండా ఇప్పటికి కమిట్ అయిన సినిమాలు చేద్దామని అనుకుంటున్నారు.


హరిహర వీరమల్లు

ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న హరిహర వీరమల్లు మూవీ చాలా రోజులుగా ఆగిపోయింది. రీసెంట్ గా ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ ను సంప్రదించి కేవలం పది రోజుల సమయం తనకి కేటాయించాల్సిందిగా అభ్యర్థించాడట. పవన్ కూడా అంత బిజీగా ఉండి తన వలన నిర్మాత నష్టపోకూడదని అందుకు ఒప్పుకున్నారని సమాచారం. అదే జరిగితే త్వరలోనే ఈ చిత్రం పూర్తి అయి రేపటి దసరాకో లేక సంక్రాంతికో రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే మరో చిత్రం కూడా ఇదే గ్యాప్ లో పూర్తిచేయాలనే యోచనలో ఉన్నారట పవన్.

సుజిత్ దర్శకత్వంలో ఓజీ

యువ దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ.జీ అనే మూవీని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీని సైతం పవన్ కళ్యాణ్ పూర్తిచేయాలనే ఆలోచనతో ఉన్నారట. ఈ రెండు చిత్రాలు పూర్తయితే తమ హీరో సినిమాలు ఈ సంవత్సరంలో చూసెయ్యచ్చని ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 2022లో భీమ్లానాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఏదీ రాలేదు. రెండేళ్లుగా గ్యాప్ వచ్చినా రెండు లేటెస్ట్ సినిమాలతో మళ్లీ పవన్ కళ్యాణ్ ను చూడొచ్చని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×