BigTV English

Ash Gourd Health Benefits: గుమ్మడికాయతో ఎన్నో బెనిఫిట్స్.. బరువు తగ్గొచ్చు కూడా !

Ash Gourd Health Benefits: గుమ్మడికాయతో ఎన్నో బెనిఫిట్స్.. బరువు తగ్గొచ్చు కూడా !

Ash Gourd Health Benefits: గుమ్మడికాయను ఎక్కువగా దిష్టి తీయడానికి లేదా ఇంటి ముందు వేలాడదీయడానికి వాడుతుంటారు. మరికొందరు వడియాలు పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరు వంటలో ఉపయోగిస్తారు. కానీ గుమ్మడికాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్‌కు గుమ్మడికాయ పరిష్కారం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి అందుకు సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గుతారు:
గుమ్మడికాయ జ్యూస్‌లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తాగడం వల్ల పొట్ట నిండినట్టు అనిపించి ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో జనరల్ ఆఫ్ ది అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్‌ లో ప్రచురించిన నివేదిక ప్రకారం బూడిద గుమ్మడి కాయ రసం తాగినవాళ్లు తక్కువ ఆహారం తీసుకున్నారని అలాగే బరువు కూడా తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన టెక్సాస్ విశ్వవిద్యాలయంలో జరిగింది.
జీర్ణక్రియకు మేలు:
గుమ్మడికాయలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది చక్కటి ఉపశమనం కలిగిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది:
గుమ్మడికాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడేవారు గుమ్మడికాయ జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి పెంచుతుంది:
గుమ్మడికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
చర్మం ఆరోగ్యంగా:
గుమ్మడికాయలో విటమిన్ ఏ, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మొటిమలు, చిన్న వయస్సులో ముడతలు రాకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలా తిన్న కూడా మంచిదే..
గుమ్మడికాయ ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయాన్నే గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.


  • మధుమేహం ఉన్నవారు గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవచ్చు.
  • గుమ్మడికాయలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.
  • గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీని తీసుకునే ముందు వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం కూడా మంచిదే.


Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×