BigTV English

Viral: తిరుమలలో యువతిపై విరిగిపడిన చెట్టుకొమ్మ.. తీవ్రగాయాలతో హాస్పిటల్‌కు

Viral: తిరుమలలో యువతిపై విరిగిపడిన చెట్టుకొమ్మ.. తీవ్రగాయాలతో హాస్పిటల్‌కు

Tirumala Hill: తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం వేలాది లేదా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. నిత్యం కొండ మీదికి భక్తులు వస్తూనే ఉంటారు. తిరుపతికి వెళ్లాక కేవలం శ్రీవారి దర్శనంతో సరిపెట్టుకోకుండా చుట్టుపక్కల ఉన్న ఇతర దైవ క్షేత్రాలను కూడా దర్శించి మొక్కులు సమర్పించుకుంటారు. ఇలాగే ఓ యువతి తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్లుతుండగా తీవ్ర ప్రమాదానికి గురైంది.


దర్శనం కోసం వెళ్లుతుండగా.. ఆలయ ముఖ ద్వారానికి సమీపానికి వచ్చాక హఠాత్తుగా ఓ పెద్ద చెట్టుకొమ్మ విరిగి ఆమె పై పడింది. ఆ కొమ్మ నేరుగా ఆమె తలపై పడింది. దీంతో క్షణాల్లోనే ఆమె నేలపై కూలపడిపోయింది. ఆమె పక్కనే ఉన్న వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. ఆమె భక్తిలో దైవ దర్శనానికి వెళ్లుతుండగా మార్గమధ్యంలోనే పైనుంచి పెద్ద కొమ్మ వచ్చి పడటం అందరినీ ఆందోళనలోకి నెట్టేసింది. ఈ ఘటనను తోటి భక్తులు వీడియో తీశారు.

ఈ దెబ్బతో సదరు యువతికి తలకు, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతున్నది. ఆమె వివరాలు ఏమిటన్నవి ఇంకా తెలియరాలేవు. అయితే, భీతి గొల్పుతున్న ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించిన చర్య అని పేర్కొంటుండగా.. ఆలయ దేవస్థానం మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది ఆమె క్షేమాన్ని కోరుతూ కామెంట్లు చేశారు.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×