BigTV English

Tata Punch Facelift: మళ్లీ హిట్.. టాటా పంచ్ ఫెస్‌లిఫ్ట్.. ధర ఎంతంటే?

Tata Punch Facelift: మళ్లీ హిట్.. టాటా పంచ్ ఫెస్‌లిఫ్ట్.. ధర ఎంతంటే?

Tata Punch Facelift: దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటర్స్ తన సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పంచ్‌ను 2021 సంవత్సరంలో విడుదల చేసింది. ఈ కారు లాంచ్ అయిన కొన్ని రోజులకే ప్రకంపనలు సృష్టించింది. ఆ సెగ్మెంట్ అత్యధిక సేల్స్ నమోదు చేసి నంవర్ వన్‌గా నిలిచింది. దేశంలో ఈ కారునే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పంచ్ మార్కెట్‌లో హిట్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. ధర తక్కువగా ఉండటం, 5 స్టార్ రేటింగ్ అందులో ముఖ్యంగా ఉన్నాయి.


ఈ సక్సెల్ భాగంగానే టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేయనుంది. 2021లో ప్రారంభించన తర్వాత మొదటిసారిగా దీన్ని అప్‌డేట్ చేయనున్నారు. పంచ్ బెస్ట్ సెల్లర్ వెహికల్ అయినప్పటికీ డిజైన్, బిల్డ్ క్వాలిటీ చాలా పూర్‌గా ఉంటాయి. అయితే ఈ కొత్త వాహనంలో ఎటువంటి మార్పులు ఉండనున్నాయి. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Skoda Superb: భారీ నష్టాల్లో స్కోడా.. సింగిల్ కారే సేల్.. సూబర్బ్ కారు ఫీచర్లు ఇవే!


పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో కారు బయట డిజైన్ పూర్తిగా మార్పు చేయనున్నారు. ఇందులో కొత్త గ్రిల్, కొత్త హెడ్‌లైట్లు, కొత్త బంపర్, కొత్త బానెట్‌ను దీని ముందు భాగంలో చూడొచ్చు. అంతేకాకుండా కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ ఇందులో ఉంటాయి. కొత్త పంచ్ సైడ్ ప్రొఫైల్‌లో కూడా అనేక ఛేంజస్ చేస్తున్నారు. దాని వెనుక లుక్‌తో పాటు, కొత్త టెయిల్ లైట్లు, బంపర్ ఉంటుంది. వెహికల్ సైజులో ఎటువంటి మార్పులు ఉండవు.

కొత్త టాటా పంచ్ ఇంటీరియర్‌లో కూడా చాలా పెద్ద మార్పులు ఉంటాయి. డాష్‌బోర్డ్ డిజైన్ మార్చవచ్చు. ఇందులో కొత్త అప్‌డేటెడ్ డిస్‌ప్లే ఉంటుంది. సీట్ల డిజైన్ మార్చవచ్చు. ఇందులో 2 స్పోక్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు. ఇందులో 10.25 అంగుళాల కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.

అలానే ఫ్రంట్‌లో 2 ఎయిర్‌బ్యాగ్‌లు 15 అంగుళాల టైర్లు, ఇంజన్ స్టార్ట్/ స్టాప్, 90 డిగ్రీల ఓపెనింగ్ డోర్స్, సెంట్రల్ లాకింగ్ కీ, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్+ఈబీడీ ఫ్రంట్ పవర్ విండోస్, టిల్ట్ స్టీరింగ్ ఉన్నాయి. కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇందులో సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈవీ పంచ్ ఇప్పటికే మార్కెట్‌లో ఉంది.

Also Read: Mahindra Thar Five Door: అందిరిచూపు దీనిపైనే.. ఆగస్టు 15న థార్ లాంచ్.. ఫోటోలు లీక్!

ప్రస్తుతం ఉన్న పంచ్‌లో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 72.5PS పవర్, 103 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. పంచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే కంపెనీ ధరను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. పంచ్ మార్కెట్ లో పెద్ద హిట్ కావడమే దీనికి అతిపెద్ద కారణం. ఇప్పుడు కంపెనీ తన ధరను పెంచినప్పటికీ, దాని విక్రయాలకు ఎటువంటి తేడా ఉండదు. కొత్త మోడల్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది.

Tags

Related News

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Mobile Recharge: ఎయిర్ టెల్ లోని ఈ ఆఫర్ తో రీచార్జ్ చేస్తే Netflix, Prime Video, Zee5, JioHotstar ఫ్రీగా చూసే ఛాన్స్..

Real Estate: రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలు మాత్రమే ఎందుకు చేయించుకుంటారు..దీని వెనుక ఉన్న అసలు మతలబు ఇదే..

Real Estate: క్లియర్ టైటిల్ ల్యాండ్ కొనాలి అంటే తప్పనిసరిగా చూడాల్సిన డాక్యుమెంట్స్ ఇవే…లేకపోతే భారీ నష్టం తప్పదు..

Big Stories

×