BigTV English

Y. S. Sharmila : జగన్ కు ఝలక్.. షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీ

Y. S. Sharmila : జగన్ కు ఝలక్.. షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీ

 Y. S. Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని వైఎస్ షర్మిల నివాసంలో ఈ భేటీ జరిగినట్లు టాక్ వస్తోంది. దాదాపు మూడు గంటల పాటు వీరు ఇద్దరు సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.


అయితే వీరి భేటీపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల ఆ పదవికి రాజీనామా చేశారు. అంతేగాక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోతానని కూడా ప్రకటించుకున్నారు.

ఇక పలు వివాదాలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య దూరం పెరిగింది. దీంతో ఆమె ఆ పార్టీని వదిలి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో గత ఏడాది మే, జూన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేశారు. తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.


గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ.. ఈ ఎన్నికల్లో అనూహ్యరీతిలో ఓటమిపాలైంది. కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి ఈ ఓటమిని వైసీపీ నేతలతో పాటు జగన్ సైతం ఊహించి ఉండరు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి సైతం రానంటూ జగన్ ఇంటికే పరిమితం అయ్యారు. ఆపై ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేశారు. ఇకపై ఏ పార్టీలో చేరనంటూ కేవలం వ్యవసాయం పైన దృష్టి సారిస్తానని తెలిపారు. ఈ పరిణామాలతో వైసీపీలో ఏం జరుగుతుందో అంటూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు హాట్ టాపిక్ గా మారుతున్న సమయంలోనే ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారనే వార్త ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తిని నెలకొలిపింది.

కొన్నాళ్లుగా జగన్ కుటుంబంలో వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలతోనే వైఎస్ షర్మిల ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తల్లి వైయస్ విజయమ్మ సైతం షర్మిలకే సపోర్ట్ చేశారు. కడప రాజకీయాల విషయానికి వస్తే.. వైఎస్ అవినాష్ పై తీవ్ర ఆరోపణలు చేసిన వైయస్ షర్మిల, వైఎస్ సునీత.. అన్న జగన్ ఓటమినే కోరుకున్నారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి మాత్రం జగన్ వైపే నిలబడ్డారు. అలాంటిది ప్రస్తుతం ఆ పార్టీని వీడి షర్మిలతో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక అసలు విషయం ఏంటో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆడాల్సిందే.

ALSO READ : బడ్జెట్ పై పెదవి విప్పని వైసీపీ.. అధినాయకుడు, కీలక నాయకుల మౌనం..

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×