Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియాలో అతి తక్కువ కాలంలోనే కెప్టెన్ అయిన వారిలో రోహిత్ శర్మ కూడా ఒకరు. మహేంద్ర సింగ్ ధోనీ తరహాలోనే సక్సెస్ఫుల్.. కెప్టెన్గా ఎదిగారు రోహిత్ శర్మ. టి20 వరల్డ్ కప్ సాధించిన రెండవ ప్లేయర్ గా కూడా రోహిత్ శర్మ నిలవడం జరిగింది. అయితే తాజాగా తన మతిమరుపుపై… ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తాను ఒకానొక సమయంలో పాస్ పోర్ట్ అలాగే… వాలెట్ కూడా మర్చిపోయానని వెల్లడించారు.
Also Read: Chaiwala Dolly: ఏంట్రా ఇది… గ్రౌండ్ లోనే చాయ్ అమ్ముతున్న టీ మాస్టర్?
ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇవాళ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ ముంబైలో… జరగగా… టీమిండియా ప్లేయర్లు అందరూ హాజరయ్యారు. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా చివరి t20 మ్యాచ్ కూడా ముంబైలో జరగనున్న నేపథ్యంలో… టీమిండియా ప్లేయర్ లందరూ ఈ ఈవెంట్ కు వెళ్లడం జరిగింది. అయితే… ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను… మహిళా క్రికెటర్లు స్మృతి మందాన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మాను ఆసక్తికర వ్యాఖ్యలు అడిగారు మహిళా క్రికెటర్ స్మృతి మందాన. ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా సరదాగా ఆన్సర్ ఇస్తూ అందరికీ నవ్వులు పూయించారు రోహిత్ శర్మ.
ఈ నేపథ్యంలోనే తన మతిమరుపు పైన స్పందించి… హాట్ టాపిక్ అయ్యారు రోహిత్ శర్మ. సచిన్ అవార్డు కార్యక్రమం సందర్భంగా… మీ హాబిట్స్ లో దీనిపై… టీమిండియా పురుషుల క్రికెటర్లు… మిమ్మల్ని టీజ్ చేస్తారు అని రోహిత్ శర్మను… మహిళా క్రికెటర్ స్మృతి మందాన అడిగారు. అయితే… తన మతిమరుపు పైన… తోటి క్రికెటర్లు సరదాగా ఆట పట్టిస్తారని రోహిత్ శర్మ ఆన్సర్ ఇచ్చారు. కానీ అది తన హాబీ కాదని… అప్పుడప్పుడు మతిమరుపు వస్తుందని ఆన్సర్ ఇచ్చారు. మతిమరుపులో భాగంగా ఇటీవల తన వాలెట్ అలాగే… పాస్ పోర్ట్ కూడా మర్చిపోయానని కొంతమంది వార్తలు ప్రచారం.. చేశారని రోహిత్ శర్మ తెలిపారు. కానీ అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రోహిత్ శర్మ.
Also Read: Virat Kohli: రంజీ మ్యాచ్ లు ఆడితే.. కోహ్లీకి ఎంత జీతం ఇస్తారు ?
అలాంటి సంఘటన తాజాగా జరగలేదని…. గతంలో ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు వేస్తున్నారని.. చలోక్తిగా ఆన్సర్ ఇచ్చారు రోహిత్ శర్మ. అలాంటి సంఘటన తన జీవితంలో జరిగిందని… కానీ తాను క్రికెట్లోకి వచ్చిన మొదట్లో… ఆ సంఘటన జరిగినట్లు గుర్తు చేశారు రోహిత్ శర్మ. అయితే మతిమరుపు పైన రోహిత్ శర్మ ఆన్సర్ ఇస్తుంటే… ఈవెంట్ లో ఉన్న టీమిండియా క్రికెటర్లు.. మహిళ ప్లేయర్లు కూడా చాలా సరదాగా… నవ్వేశారు. సింపుల్ గా వాళ్ళందరికీ రోహిత్ శర్మ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్లు అయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫాన్స్ కూడా నవ్వుకుంటున్నారు. అరే ఏందన్నా నీకు మతిమరుపు ఉందా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు ఫ్యాన్స్. ఏం కాదులే నువ్వు సిక్స్ లు, ఫోర్స్ కొడితే చాలు అని మరి కొంతమంది… సూచిస్తున్నారు.
Don't 𝒇𝒐𝒓𝒈𝒆𝒕 to watch this 😎
Smriti Mandhana tries to find out the one hobby that Rohit Sharma has picked up recently, which his teammates tease him about 😃#NamanAwards | @ImRo45 | @mandhana_smriti pic.twitter.com/9xZomhnJjy
— BCCI (@BCCI) February 1, 2025