E-Paper
Advertisement

యార్లగడ్డకు వల్లభనేని వంశీ లీగల్ నోటీసులు.. క్షమాపణ చెప్తావా? కోర్టుకు వస్తావా?

యార్లగడ్డకు వల్లభనేని వంశీ లీగల్ నోటీసులు.. క్షమాపణ చెప్తావా? కోర్టుకు వస్తావా?
Advertisement

Gannavaram Row: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విసిరిన ఒకే ఒక్క సవాల్.. ఏపీ రాజకీయాల్లో కార్చిచ్చు రగిల్చింది. గన్నవరం ఎయిర్‌పోర్ట్, టెర్మినల్ పనుల కాంట్రాక్ట్‌లో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఆయన చేసిన ఆరోపణలు రాజకీయాల్లో పెద్ద భూకంపమే సృష్టించాయి. మౌలిక సదుపాయాల పేరు చెప్పి.. సొంత ఖజానా నింపుకున్నారంటూ యార్లగడ్డ చేసిన కామెంట్స్, ఇద్దరి నేతల మధ్య సాగుతున్న పాత కక్షలకు సరికొత్త ఆజ్యం పోశాయి.

జైలు నుంచి విడుదలై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న వల్లభనేని.. సీఎం చంద్రబాబుకు ఏకంగా 32పేజీల లేఖ రాసి మళ్లీ పొలిటికల్ లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు. ఇలా బయటకు వచ్చారో లేదో యార్లగడ్డ కామెంట్స్ విని తేలిగ్గా తీసిపారేయలేదు. లీగల్ నోటీసులతో కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఏడు రోజుల్లో ఆధారాలతో నిరూపించాలని డెడ్‌లైన్ విధించారు. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వల్లభనేని.

Advertisement

ఈ విషయంలో యార్లగడ్డ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తొడగొడుతున్నారు. ఒకవైపు అధినేతకు లేఖల రాయబారం.. ఇంకోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేపై పోరాటంతో గన్నవరంపై పట్టు సాధించేందుకు వల్లభనేనిని వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరి వంశీ విసిరిన ఛాలెంజ్ కోర్టు మెట్లు ఎక్కుతుందా? లేదంటే సవాళ్లు, ప్రతిసవాళ్లతో సరిపెట్టుకుంటుందా?

Tags

Related News

E20 పెట్రోల్ వివాదం.. కేంద్రం దిగొచ్చినా వెనక్కి తగ్గని వాహనదారులు!

ధాన్యం మాఫియా వెనుక ఎవరున్నారు?

ప్రభుత్వ బడులపై భారీ ఫోకస్.. ఒక్కో స్టూడెంట్‌పై రూ.1.08 లక్షలు!

హర్మూజ్ జలసంధి వద్ద ఏం జరుగుతోంది.. కళ్లకు కట్టినట్లు ‘బిగ్ టీవీ’ విజువల్ ప్రజెంటేషన్!

తగ్గేదేలే అంటున్న సీఎం.. రద్దు చేయాల్సిందేనంటున్న ప్రతిపక్షాలు.. హైడ్రా రగడలో గెలుపెవరిది?

పేపర్ లీక్.. ఉద్యోగాలు సేల్? డీఎస్సీ మంటల్లో ఏపీ రాజకీయం!

స్కూల్ బాలికల కన్నీటి గాథ.. బిగ్ టీవీ కథనంతో అధికారుల యాక్షన్

Big Stories

Advertisement
×