E-Paper
Advertisement

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!
Advertisement

BC Census: BCల జనాభా ఎంత..? వాళ్ల సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏంటి..? ప్రాతినిధ్యం ఎంత..? ఈ లెక్కలు లేకుండా సంక్షేమం, రిజర్వేషన్లపై శాస్త్రీయ నిర్ణయాలు ఎలా తీసుకుంటారన్నదే కాంగ్రెస్‌ వాదన. అందుకే 2027 జనగణనలో BCలకు ప్రత్యేక కేటగిరీ, స్పష్టమైన కులాల వివరాలు నమోదు చేసేలా ప్రశ్నావళి ఉండాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. తెలంగాణలో జరిగిన కులసర్వేను మోడల్‌గా తీసుకుని కేంద్రం కూడా లెక్కలు సేకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. సీఎం రేవంత్‌రెడ్డి సైతం తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. కచ్చితమైన BC జనాభా డేటా వస్తే భవిష్యత్‌ సామాజిక-రాజకీయ వాటాల లెక్క తేలుతుందన్న ఆశతో ఆ వర్గాలు ఉన్నాయి. కేంద్రం కులగణన చేస్తామని చెప్పి మాట తప్పి బలహీనవర్గాలను మోసం చేస్తోందన్న ఆరోపణలు పెంచుతోంది కాంగ్రెస్. దేశాన్ని దాదాపు 65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ కులగణన ఎందుకు చేయలేదని బీజేపీ క్వశ్చన్ చేస్తోంది. మరి ఈ వార్ ఎటు దారి తీయబోతోంది?

Tags

Related News

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

Big Stories

Advertisement
×