GO 97: GO 97 చుట్టూనే అసలు వివాదం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను కొత్త స్కిల్ ఎకో సిస్టమ్‌లోకి తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, లెక్చరర్లలో అనుమానాలు మొదలయ్యాయ్. తెలంగాణలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని BRS తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు పాలిటెక్నిక్ భూములపై ప్రభుత్వం కన్ను వేశారంటూ కౌంటర్లు వేస్తున్నారు. విద్యార్థుల భయం మాత్రం కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాదు. తమ కాలేజీల స్వయం ప్రతిపత్తి, డిప్లొమా విలువ, ఈసెట్ లేటరల్ ఎంట్రీ అవకాశాలపై స్పష్టత కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందుకే GO 97 రద్దు చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయ్. మరోవైపు పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరించే ఉద్దేశం లేదని సీఎం రేవంత్ చెబుతూనే ఉన్నారు. పాలిటెక్నిక్ విద్యను 8వేల కోట్లతో ఆధునికీకరించాలనుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. జీవో 97లో మార్పులు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. ప్రైవేటీకరణ లేదన్న సీఎం మాటతో విద్యార్థుల అనుమానాలు తొలగుతాయా..? లేక GO 97లోని ప్రతి అంశంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందా..? చూడాలి.