CURE Bill: హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. పాత మున్సిపల్ చట్టం సరిపోదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం క్యూర్ బిల్ తీసుకొచ్చింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు హైడ్రా, వాటర్ బోర్డు, రోడ్ల వంటి విభాగాల మధ్య సమన్వయం పెంచడం దీని ప్రధాన లక్ష్యం. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, చెత్త, ప్లాస్టిక్, అక్రమ నిర్మాణాలు, వరదలపై కఠిన నిబంధనలు అమల్లోకి అవకాశముంది. అంటే హైదరాబాద్‌ను మరింత క్లీన్, గ్రీన్, పర్యావరణ హిత సిటీగా మార్చే అవకాశం ఉంది. కానీ మరోవైపు అసలు హాట్ టాపిక్ ఆస్తి పన్ను. ప్రస్తుతం ఉన్న యాన్యువల్ రెంటల్ వాల్యూ విధానానికి బదులు క్యాపిటల్ వాల్యూ విధానం తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇది అమలైతే మార్కెట్ విలువ ఆధారంగా పన్ను లెక్కించే అవకాశం ఉంటుంది. దీంతో కొన్ని ఆస్తులకు పన్ను చాలా మోతెక్కిపోతుందని అంటున్నారు. మొత్తంగా, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ఈ చట్టం డిజిటల్ మరియు మౌలిక వసతుల పరంగా ఎంతో ప్లస్ అయినప్పటికీ.. ట్యాక్సులు, ఫైన్ల రూపంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతుందనేది ప్రధాన ఆందోళనగా ఉంది.