Congress Leadership: కాంగ్రెస్‌లో ఇప్పుడు మార్పుల కాలం మొదలైనట్టే కనిపిస్తోంది. AICCలో కీలక పదవుల కోసం రాహుల్ గాంధీ స్వయంగా పలువురు నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. కొత్త టీమ్‌లో యువతతో పాటు సామాజిక న్యాయం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, గ్రౌండ్ లెవెల్ పనితీరుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది యూపీ, గుజరాత్, పంజాబ్ సహా ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో ఆ దిశగా గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. పంజాబ్‌లో అంతర్గత విబేధాలను చక్కదిద్దేందుకు భూపేష్ బఘేల్ స్థానంలో సచిన్ పైలట్‌ను ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి.. ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపైనా చర్చ జరుగుతోంది. మరోవైపు ఖర్గే పదవీకాలం తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేసీ వేణుగోపాల్‌కు అప్పగించే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా ఆసక్తి రేపుతోంది. అయితే ఇవన్నీ ఇంకా పార్టీ బయటకు చెప్పకపోయినా సీన్ చూస్తే అవే నిజం అనిపించేలా ఉన్నాయ్. తాజా పరిణామాలను చూస్తే కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కో రాష్ట్రంలోని బలహీనతలను గుర్తించి.. ఎన్నికలకు ముందే నాయకత్వాన్ని రీసెట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ మార్పులు కాంగ్రెస్‌కు కొత్త ఊపునిస్తాయా..?