Big Stories

Ummareddy Venkata Ramana: ఎంపీ టికిట్ నిరాకరించిన ఉమ్మారెడ్డి!.. గుంటూరు వైసీపీలో గుబులు! 

Ummareddy Venkata Ramana: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అభ్యర్ధులను మార్చేస్తూ రిలీజ్ చేస్తున్న లిస్టుల ఎఫెక్ట్ వైసీపీపై గట్టిగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మరికొందరు క్యూలో ఉన్నారంటున్నారు. అది చాలదన్నట్లు కొత్తగా ప్రకటిస్తున్న ఇన్‌చార్జుల్లో కొందరు పోటీకి నో చెప్తుండటం. ఆ పార్టీ పెద్దలకు మరింత తలనొప్పిగా మారిందంట. తాజాగా గుంటూరు ఎంపీ స్థానం ఇన్‌చార్జ్‌గా ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకటరమణ ఎంపీగా పోటీకి రెడీగా లేనని చెప్పేశారంట. దాంతో కీలకమైన గుంటూరులో మరో అభ్యర్ధిని వెతుక్కోవాల్సి వస్తోంది వైసీపీకి.

- Advertisement -

టార్గెట్ 175 అంటున్న వైసీపీ నేత జగన్‌ కొన్ని చోట్ల కేండెట్లే కరువవుతున్నట్లు కనిపిస్తోంది .. సహజంగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు అభ్యర్థుల కరువు ఉండదు. టికెట్ల కోసం ఆశావహులు క్యూ కడుతుంటారు. అయితే వైసీపీకి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్ధుల మార్పులు చేర్పులతో విడతల వారీగా జాబితాలు విడుదల చేస్తున్న వైసీపీకి.. షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు పార్టీకి గుడ్ బై చెప్తున్న సిట్టింగుల సంఖ్య పెరుగుతుంటే .. మరోవైపు ఏరి కోరి ఎంపిక చేసిన కొత్త అభ్యర్ధులు పోటీకి ససేమిరా అంటుండటం .. పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందంట.

- Advertisement -

ఇప్పటికే తిరుపతి, మచిలీపట్నం లోక్‌సభ సెగ్మెంట్లకు జగన్ ప్రకటించిన ఇన్చార్జులు చేతులెత్తేశారు. తాజాగా గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్‌ అభ్యర్ధిగా ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకటరమణ కూడా పోటీకి ససేమిరా అంటుండటం జగన్‌కు షాక్ ఇచ్చిందంట. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి ఏ పార్టీలో అయినా విపరీతమైన పోటీ ఉంటుంది. అయితే వైసీపీలో మాత్రం అంత సీన్ కనిపించడం లేదు.

కుల సమీకరణలు, ఆర్థిక బలం .. ఇలా అన్ని లెక్కలు వేసుకుని .. గుంటూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి గా మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకట రమణని ఏరికోరి ఎంపిక చేసి మరీ ప్రకటించారు జగన్. ఆ ప్రకటన చేసి వారం దాటిపోయినా సదరు కేండెట్ నియోజకవర్గం వైపు చూడలేదు. దాంతో ఆయన పోటీ చేస్తారా..లేదా తెలియని అయోమయంలో ఉన్నాయి గుంటూరు వైసీపీ శ్రేణులు. అయితే ఉమ్మారెడ్డి వెంకటరమణ మాత్రం పార్లమెంట్‌కి పోటీ చేయలేనని.. ఎమ్మెల్యే టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారంట. ఆ విషయాన్ని అసెంబ్లీలో సీఎంకే స్వయంగా చెప్పారంట ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.

ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు ఎంపీ స్థానాన్ని రెండు సార్లు గెలుచుకున్న టీడీపీకి .. విభజన తర్వాత ఆ సెగ్మెంట్ కంచుకోట గా మారిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో గల్లా జయదేవ్ వరుస విజయాలు సాధించారు. ఇటీవల పలు సర్వేలు కూడా టీడీపీకే అనుకాలంగా నివేదికలిచ్చాయి. దాంతో పోటీ చేసి చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని భావిస్తున్నారంట ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ .. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న వెంకటరమణ తండ్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేయించుకున్న సర్వేల్లో కూడా టీడీపీకే ఎడ్జ్ కనిపించిదంట .. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారంటున్నారు సన్నిహితులు.

ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా ఎంపీ బరిలోకి దిగి వందల కోట్లు వదిలించుకుని.. ఆస్తులను హారతి కర్పూరం చేసుకోవడం ఎందుకని.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారంట తండ్రీ కొడుకులు. ఇప్పటికే పొన్నూరు ఎమ్మెల్యే గా ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోశయ్య ఉన్నారు. ఆయనకి టిక్కెట్ ఫైనల్ కాలేదు.. వస్తోందనే నమ్మకం కూడా ఆ ఫ్యామిలీలో లేదంట. అందుకే తమకు గుంటూరు 2 ఇవ్వాలని పెద్ద ఉమ్మారెడ్డి సీఎం ని కోరారంట. మరి చూడాలి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News