Big Stories

Trump says will Aid Russia: నాటో దేశాలపై దాడి చేయమని రష్యాను ప్రోత్సహిస్తా: ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

Trump Says will Aid Russia: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బకాయిలు చెల్లించని, రక్షణ బడ్జెట్ పెంచని నాటో దేశాలపై రష్యా దాడి చేస్తే.. తాను రష్యాను ప్రోత్సహిస్తానని చెప్పారు.

- Advertisement -

ఫిబ్రవరి 24న ప్రెసిడెన్షియల్ ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో ఉన్న సౌత్ కరోలినాలోని కాన్వేలో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

2022 ఫిబ్రవరి నుంచి రష్యాతో యుద్ధంతో చేస్తున్న ఉక్రెయిన్‌ని సహాయం చేస్తున్న నాటో కూటమి దేశాలపై ట్రంప్ ఇలాంటి విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది.

”నేను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఒక నాటో సభ్య దేశ ప్రెసిడెంట్ నాతో ఒకసారి మాట్లాడుతూ.. మేము మీకు బకాయిలు చెల్లించకపోతే.. రష్యా మా దేశంపై దాడి చేసినప్పుడు మీ సహాయం చేస్తారా?.. అని అడిగారు. దానికి నేను మీరు బకాయిలు చెల్లించలేదంటే మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు. అలాంటి సమయంలో అమెరికా మీకు సహాయం చేయదు. పైగా శత్రువులు మీపై దాడి చేస్తే.. నేనే వారిని ప్రోత్సహిస్తాను. అందుకే మీరు బకాయిలు తప్పనిసరిగా చెల్లించాల్సిందే.. అని సమాధానం చెప్పాను.” అని ట్రంప్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగం చేస్తూ చెప్పారు.

ట్రంప్ వ్యాఖ్యాలను వైట్ హౌస్ ప్రతినిధి ఆండ్రూ బేట్స్ ఖండించారు. ట్రంప్ వ్యాఖ్యలలో పరిపక్వత లేదని.. చాలా షాకింగ్‌గా ఉన్నయని బేట్స్ అన్నారు. ట్రంప్ అలా మాట్లాడడం.. ఆయన మానసిక స్థితిని తెలియజేస్తోందని.. హంతకులను(రష్యా) మన మిత్ర దేశాలపైకి దాడి చేయమని ప్రోత్సహించడం.. అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక పరిస్థితులపై దుష్ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News