దువ్వాడ శ్రీనివాస్.. మొన్నటి వరకూ వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. గత ఎన్నికల్లో టెక్కలి వైసీపీ అభ్యర్థిగా పోటీ ఇచ్చిన నేత. మాస్ లేడర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పెళ్లిళ్ల అంశంపై తరచూ స్పందించి ఓ దశలో వివాదాస్పదందా మారారు. ఇటీవల ఇంట్లో జరుగుతున్న
గొడవలతో దువ్వాడ సతమతం అవుతున్నారు. మాధురి అనే మహిళతో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ శ్రీనివాస్ సతీమణి వాణి ఆరోపణ.. తర్వాత మాధురి స్పందన.. అనంతరం పరిణామాలు.. దువ్వాడను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తనను అభాసుపాలు చెయ్యాలనే భార్యా పిల్లలు పనికట్టుకుని రభస చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తన వైవాహిక జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నానని.. కానీ.. ఎవరకీ తలవంచబోనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ దూరం పెట్టిందా అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. వారం రోజులుగా కుటుంబ గొడవలతో దువ్వాడ సతమతమవుతుంటే ఒక్కరూ సపోర్టు చేసిన దాఖలాలు లేవు.
ప్రస్తుత MLCగా ఉండి.. గతంలో మూడు సార్లు MLAగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ పట్టించుకోవడం లేదనే అర్థమవుతోంది. దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించకపోగా.. ఇతర నేతలు కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. దువ్వాడ ఇంట్లో జరుగుతున్న అంశాలు.. పూర్తిగా ఆయన వ్యక్తిగతమని.. దానికి.. పార్టీకీ సంబంధం లేదని వైసీపీ అగ్రనేత Y.V. సుబ్బారెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చేశారు.
దువ్వాడ శ్రీనివాస్ అంశంపై కూటమి నేతలు కూడా స్పందించారు. ఎమ్మెల్సీ అనంత్ బాబు, ఎమ్మెల్సీ దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు.
చాలామంది మహిళలు.. రాజకీయ నేతల బాధితులుగా కనిపిస్తున్నారన్న ఆయన.. పార్టీలూ అలాంటి నేతలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జగన్ నైతిక ధైర్యంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే చర్యలు తీసుకోవాల్సిందేనని డొక్కా వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల అంశంపై ప్రతి మీటింగ్‌లోనూ మాట్లాడిన జగన్.. నోరు ఎందుకు విప్పటం లేదని ప్రశ్నిస్తున్నారు.
Also Read: వర్మ భవితవ్యమేంటి! పిఠాపురం వీడేనా?
ఏపీలో శాంతిభద్రతలపై గగ్గోలు పెడుతున్న జగన్.. వైసీపీ నేతలు అరాచకాలు, అక్రమాలపై ఎప్పుడు జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తారని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రశ్నించారు.టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీకి రక్షణ లేకుండా పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలపైన దాడి చేస్తున్న రాజకీయ నాయకులని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజానాయకుడిగా ఉండి మహిళలపై ఇంతలా దుర్మార్గంగా ప్రవర్తించడం దారుణమన్న కడప ఎమ్మెల్యే.. ఇలాంటి నేతలే ఐదేళ్లూ రాష్ట్రాన్ని పాలించారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే విధంగా వైసీపీ అధినేత జగన్ ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీలో ఉన్న అవినీతి నేతల్ని ఏరిపారేయాలంటూ మాధవి డిమాండ్ చేశారు.
గతంలోనూ విజయసాయిరెడ్డి,శాంతి ఇష్యూలో వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకోలేదు. ఫ్యామిలీ మ్యాటర్స్, వివాహేతర సంబంధాల విషయంలో.. జోక్యం చేసుకుంటే పార్టీ పరువు పోతుందన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోనే MLC అనంతబాబుకు మద్దతు ఇచ్చి దెబ్బతిన్నామని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు.. దువ్వాడ MLC రద్దు చేయాలని ఆయన సతీమణి వాణి డిమాండ్ చేస్తున్నారు. వాణి డిమాండ్ పైనా అటు వైసీపీ.. ఇటు జగన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటం చర్చనీయాంశంగా మారింది.