ఏపీ రాజకీయాల్లో విమర్శల పర్వం కొనసాగుతోంది.ప్రభుత్వం ఏది చేసినా ప్రతిపక్ష పార్టీలు పెద్దగా సమర్థించవు. విమర్శల కోణంలోనే చూస్తుంటాయి.ప్రస్తుతం ఏపీలోనూ అదే జరుగుతోంది.గత ప్రభుత్వంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏపీకి వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్.. తాజాగా కూటమి ప్రభుత్వంలో మైక్రోసాఫ్ట్ హెడ్ బిల్ గేట్స్ ఏపీకి వచ్చిన సందర్భంలోనూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు.. లేనప్పుడు కూడా ఆ పార్టీ నేతల తీరు మారదా? అని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్లు ఏం చెప్పారు? ఎందుకు అలా మాట్లాడారు? వారు అన్నదాంట్లో తప్పు ఏముంది? అనే ఆలోచనను వైసీపీ నేతలు ఎందుకు చేయలేకపోతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెలబ్రిటీలు,అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినప్పుడల్లా చర్చలు చెలరేగడం సహజం.అటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి.గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రజనీకాంత్ ఏపీకి వచ్చారు. అప్పట్లో ఆయన రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో ఉన్నారు. ఒక కార్యక్రమంలో ఆయన “ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి”, “వ్యవస్థలో పారదర్శకత ఉండాలి” వంటి మాటలు మాట్లాడారు.ఇవి అప్పటి ప్రభుత్వంపై పరోక్ష విమర్శలుగా భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, “ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా రజినీకాంత్ మాట్లాడారు”, “బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు” అంటూ రజనీకాంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో పెనుదుమారమే లేపాయి.
తాజాగా మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఏపీకి వచ్చి ప్రభుత్వంతో ఆరోగ్యం, విద్య, టెక్నాలజీ రంగాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటనకు ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. దీనిపై వైసీపీ స్పందిస్తూ.. “ఇది కేవలం పబ్లిసిటీ కోసమే” అని ఆరోపించింది. “ప్రజలకు ఉపయోగపడే స్పష్టమైన ఒప్పందాలు లేవు” అని.. “గతంలో జగన్ ప్రభుత్వంతోనూ బిల్ గేట్స్ పనిచేశారు” అంటూ విమర్శలు చేసింది. ఈ రెండు ఘటనల్లోనూ ఒక విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. సెలబ్రిటీలు విచ్చేసిన క్రమంలో రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూరింది అని ఆలోచన చేయకుండా విమర్శలు చేయడం ఏంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.
ysrcp : దేవుడి పేరిట వైసీపీ రాజకీయం..!
బిల్ గేట్స్ ఏపీ రాక సందర్బంగా కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రజాసంక్షేమం, భవిష్యత్ నిర్మాణం, ఉపాధి, విద్య, ఆరోగ్యం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ఆయన కొనియాడారు. ప్రపంచంలోనే బడా పారిశ్రామిక వేత్త సీఎం చంద్రబాబు పాలనపై కితాబు ఇవ్వడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. మరోసారి వైసీపీ నేతలు డ్రైనేజీ తెరిచారని.. తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రతి దాన్ని రాజకీయం చేయడం వారికి అలవాటే అని.. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా వారి తీరు మారడం లేదని.. సీఎం చంద్రబాబును, మంత్రి నారాలోకేశ్‌ను తిట్టడమే వారి పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.