BigTV English

YCP Sixth List : వైసీపీ ఆరో జాబితా విడుదల.. మార్పులివే..

YCP Sixth List : వైసీపీ ఆరో జాబితా విడుదల.. మార్పులివే..
YCP Sixth List

YCP Sixth List : రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు 10 మందితో కూడిన ఆరో జాబితాను వైసీపీ విడుదల చేసింది. 4 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జుల ప్రకటించింది. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆరో జాబితాను సజ్జల రామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున విడుదల చేశారు.


గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా నియమించింది వైసీపీ. నాగార్జున రెడ్డికి గిద్దలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్‌కు నెల్లూరు సిటీ, డిప్యూటీ సీఎం నారాయణస్వామికి జీడీ నెల్లూర్, బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు, నర్నాల తిరుపతి యాదవ్‌కు మైలవరం నియోజకవర్గాలను వైసీపీ కేటాయించింది.

ఇక 4 ఎంపీ నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించింది. డా.గూడూరి శ్రీనివాస్‌కి రాజమండ్రి, అడ్వకేట్ గూడూరి ఉమాబాలకు నర్సాపురం, ఉమ్మారెడ్డి వెంకటరమణకు గుంటూరు, ఎన్. రెడ్డప్పకు చిత్తూరు నియోజకవర్గాలను వైసీపీ కేటాయించింది.


ఇప్పటి వరకు ఐదు జాబితాలు ప్రకటించిన వైసీపీ.. 61 మంది అసెంబ్లీ స్థానాలకు, 14 పార్లమెంటు స్థానాలకు ఇన్‌ఛార్జులను మార్చేసింది.

వైసీపీ.. ఇన్‌ఛార్జులతో పాటు రీజినల్ కో-ఆర్డినేటర్లను నియమించింది. విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు వైవీ సుబ్బారెడ్డిని నియమించింది. అరకు లోక్ సభ నియోజకవర్గంలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావును డిప్యూటీ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. మజ్జి శ్రీనివాసరావు మంత్రి బొత్స సత్యనారాయణకు మేనల్లుడు కావడం విశేషం.

Related News

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Big Stories

×