Ysrcp: లిక్కర్ స్కామ్‌లో వైసీపీలో గుబులు రేపుతోందా? దీని నుంచి డైవర్ట్ చేసేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుందా? ఈ కేసు విచారణకు ముందు టీడీపీకి చెందని ఓ మంత్రితో విజయసాయిరెడ్డి భేటీ అయిన వీడియో బయటపెట్టడం వెనుక కథేంటి? మద్యం కుంభకోణం జరిగిందని వైసీపీ అంగీకరించినట్టేనా? ఈ కేసు వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ స్కెచ్ వేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కేసులో మాస్టర్ మైండ్ టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది అసలు కుంభకోణం కాందంటూ వారిస్తున్న వైసీపీ నేతలు, దీనివెనుక కర్మ, కర్త, క్రియ ఎవరన్నది ఏపీ ప్రజలకు తెలుసు. మద్యం అమ్మిన సొమ్ములు ఎక్కడ? ఎవరెవరి నుంచి ఎంతెంత ముడుపులు తీసుకున్నారు? ఎక్కడకు వెళ్లాయి? ఇప్పటికే డీటేల్స్ సేకరించిన సిట్, దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఈ కేసులో నాలుగైదు రోజుల్లో కీలక నేత ఒకరు అరెస్టు కావచ్చంటూ సంకేతాలు బయటకు వచ్చాయి. దీంతో వైసీపీలో గుబులు మొదలైంది.
మద్యం కేసు సీఐడీ విచారణకు కొన్నిగంటల ముందు విజయసాయిరెడ్డి.. టీడీపీ నేత టీడీ జనార్థన్‌తో రహస్య సమావేశం నిర్వహించినట్టు ఓ వీడియో బయటపెట్టింది వైసీపీ. మార్చి నెల 11 తేదీన సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో తాడేపల్లి పార్క్ విల్లాకు తొలుత విజయసాయిరెడ్డి వచ్చారు. కొద్దిసేపటికి టీడీపీ నేత టీడీ జనార్థన్ వచ్చారు.
ఆ విల్లాలో ఏదైనా ఫంక్షన్‌కు ఇరువురు నేతలు హాజరయ్యారా? లేక ఎవరైనా తెలిసినవారి కబురు పెట్టారా? వైసీపీ ఆరోపించినట్టుగా మద్యం కేసు గురించి మాట్లాడారో తెలీదు. కానీ వైసీపీ మాత్రం సీఐడీ విచారణకు కొద్ది గంటల ముందు టీడీపీ నేతతో సాయిరెడ్డి భేటీ కావడం వెనుక అసలు కథేంటి? అని ప్రశ్నించింది.
అది ఓ రాజకీయ నేత నివాసం. ఇటీవల ఆయన గాయపడ్డారు. ఆపరేషన్ తర్వాత ఆయన్ని పరామర్శించేందుకు అధికార, విపక్షానికి చెందిన నేతలు వెళ్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే సాయిరెడ్డి, టీడీ జనార్థన్ రెడ్డి వారు వెళ్లారని అంటున్నారు.
ALSO READ: కాకాణి అరెస్ట్, వైసీపీలో టెన్షన్ మొదలు
కేసు విచారణలో సాయిరెడ్డి వంతు ముగియగానే మీడియా ముందుకొచ్చి ఆయన జగన్‌పై తీవ్ర ఆరోపణలు, అలాగే ఈ స్కామ్ వెనుక కీలక నిందితుల పేర్లు బయటపెట్టారన్నది వైసీపీ వాదన. ఇది కూటమి సర్కార్‌కు మేలు చేసినట్టు కాదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది.
వైసీపీ ఆరోపించినట్టుగానే మద్యం కేసు నుంచి తప్పించుకునేందుకు సాయిరెడ్డి భేటీ అయ్యారా? చెప్పడం కష్టమే. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం వీడియో చూపించి ఆరోపణలకు పరిమితమైంది వైసీపీ. లిక్కర్ కేసు దర్యాప్తు ఓ సిట్ చేస్తోంది. ఇంకోవైపు ఈడీ చేస్తోంది.
ఎలాంటి ఆధారాలు లేకుంటే నిందితులకు న్యాయస్థానం ఎందుకు బెయిల్ ఇవ్వదు? మరోవైపు బలంగా వినిపిస్తున్న ప్రశ్న. కాకపోతే లిక్కర్ కుంభకోణం వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు సాయిరెడ్డి ఎపిసోడ్ ముందుపెట్టి వైసీపీ నాటకం ఆడుతుందని అధికార పార్టీ నేతల మాట. మొత్తానికి ఈ వారంలో మద్యం వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకోనుంది.
విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు..
మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం
తాడేపల్లి పార్క్ విల్లాలో..
విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి
13 నిమిషాల తర్వాత అదే విల్లాకు @ncbn నమ్మినబంటు టీడీ జనార్ధన్.… pic.twitter.com/XYgtZsJSE4— YSR Congress Party (@YSRCParty) May 25, 2025